Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రియతమా!
నా జీవితానికి నువ్వే లోకమనుకున్నాను.
నువ్వే కాకుండా పోతే ఎలా?
అవతల ఎంత పెద్ద లోకం ఉన్నా శూన్యంగానే అనిపిస్తుంది.
నా జీవితం కూడా ఇప్పుడు ఒక్కొక్క అడుగే వేస్తూ....
ఆ శూన్యంలో కలిసిపోతున్నట్లే అనిపిస్తుంది.
అయినా..
నిన్నటి దాకా నువ్వు సైతం నన్నే నీ సమస్త లోకం అన్నదానివే కదా!
అలాంటి నువ్వే ఉన్నట్లుండి..
నీ దారిన నువ్వుఎలా వెళ్లిపోగాలిగావు?
నీకు నీవుగా కొత్త లోకాన్ని ఎంచుకున్నావా?
లేదా ఆ లోకమే నిన్ను వరించిందా?
లేక నువ్వే వెదుక్కుంటూ వెళ్లిపోయావా?
ఏది ఏమైతేనేం...
నువ్వైతే ఆ కొత్త లోకంలోకి వెళ్లిపోయావు.
ఇంతటితో..
నీ ఆలోచనలు మారిపోయాయి.
నీ జీవిత లక్ష్యాలూ మారిపోయాయి.
మన జీవితాలూ తారుమారై పోయాయి....
అలా వద్దనుకుంటే....,
తొలినుంచే ఎవరికి వారుగా ఉండిపోతే..
ఏ సమస్యా ఉండేది కాదు కదా!
కడదాకా కలసి నడవాలనుకుని..
అర్థాంతరంగా దారులు మార్చుకుంటే ఎలా?
ప్రియా!
నీ అవ్యాజమైన ప్రేమకు హద్దులు ఉన్నాయా?
హద్దులంటూ ఉంటే అసలది ప్రేమ ఎలా అవుతుంది?
ప్రేమ అభయాన్నిస్తుంది.
అద్వైతంగా ఉంటుంది.
అవును మరి!
ప్రేమలో ఒకే లోకం ఉంటుంది.
ఆ లోకం ఒక్కరి కోసమే నిర్మించబడుతుంది.
ఆ ఒకే ఒక్క నా లోకం నీ కోసమే....
నేస్తమా..!
ప్రేమైనా, వియోగమైనా అక్కడే,
జీవనమైనా, మరణమైనా అక్కడే.
అలాంటి నాకు నువ్వన్నా లోకమే చేజారిపోతే...
ఈ లోకంలో ఇంకేదీ నిజం కాదనిపిస్తుంది.
చివరికి ప్రేమ కూడా అబద్దమే అనిపిస్తుంది..
-పొన్నం రవిచంద్ర ,
9440077499