చనిపోయాక నేనేమౌతాను పాతి పెట్టాక మళ్ళీ మొలుస్తానా దహనం చేశాక మళ్ళీ వెలుగుతానా భూమి నీరు, నిప్పు, ఆకాశం, గాలి నాలోంచి ఎక్కడికి పోతాయి? నిజంగానే ఆత్మ గిరికీలు కొడుతూ పిట్టలా ఎగిరిపోతుందా కన్నీళ్ల తో తడిసిన దేహం నవ్వులతో మురిసిన దేహం కష్టాలు సుఖాలు లాభాలు నష్టాలు గెలుపోటముల జమిలి ఆట
నేను లేకపోకడం పెద్ద ఖాళీ కాదనుకుంటా పూరించడానికి సవాలక్ష చేతులున్నారు కాళ్ళున్నారుజి హదయాలున్నారు ఖాళీలు పూరించబడతారు ఇల్లు నా నిశ్శబ్దాన్ని మోస్తుంది చూపు ఎక్కడో ఆగిపోతుంది ఇంతకీ నేను ఎక్కడికి పోతాను ఓటరు జాబితాలో నా పేరు కొట్టేస్తారు నా ఆధార్ కార్డ్ వధా ఐపోతుంది నా వాటా రేషన్ ఆగిపోతుంది నా ప్రొఫైల్ పిక్చర్ ఎవరు మారుస్తారు నా స్టేటస్ ఏమవుతుంది