Sun 23 Jan 22:53:28.737572 2022 పల్లెల్లో శ్రమించి పండించే రైతులుకుట్రలను ఎదురొడ్డి పొలంవిడిచి నిరసన గళాలతో రోడ్డెక్కటం..కులవత్తులు కూడు పెట్టకకూలిబతుకు నయమని నగరానికి వలస వచ్చిననలిగిపోయిన దీనులు..అడవి కడుపులో ఆదమరిచి ఆనందంగా బ్రతికే ఆదివాసులుస్వార్థ శక్తుల కుట్రలకు బెదిరి చెదిరిపోవటం...అందమైన బాల్యం బందీ అయిచదువుల గంధం ఆవిరైఉద్యోగం, వ్యాపారం అన్నీకంప్యూటర్ తెరలకు చిక్కిజనజీవనం అతలాకుతలమైరెండేళ్ల తప్పని అజ్ఞాత జీవితంలోబ్రతకలేక పోతున్న సామాన్యుడు..ఆరు పదుల ఆటుపోట్ల జీవనంలోతడిఆరని తీరంలా నిశ్చలసాక్షినై..దుఃఖాల చీకట్లనూఆనందాల వెలుగులనుసమంగా అనుభవించిన జీవినివసంతకాల మేఘ గర్జనలనుతూర్పు పవన ఈదురు గాలులనుఅస్తిత్వ పోరాటాల ఉప్పెనలను మిలియన్ మార్చ్ లకు కదిలి నడిచిన తరం నాదికాలాన్ని కొత్తగా కోవిడ్ పూర్వకోవిడ్ అనంతర దశలుగా...దొరకని ప్రాణ వాయువు తోడుగాసంజీవిని టీకాలతో ఊపిరి పీల్చుకబ్రతుకుతున్న యుగం మనదిబ్రతును ప్రేమిస్తూసంఘర్షణే జీవితమైపోరాటమే ఊపిరిగామనిషిగా బ్రతుకుతూమానవత్వాన్ని స్వాగతించేపాత కాలపు జీవిని నేనే !- డా|| కె. దివాకరా చారి, 9391018972 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి