Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నో ఒంటరి రాత్రులు
కన్నీటి ధారలలో గడిపినట్లు గుర్తు
ఆనాటి యవ్వనపురోజులు ఇంకా గుర్తు
నువ్వు ఎదురు పడగానే గుండె లయతప్పడం గుర్తు
నువ్వు నీ చిటికెన వేలు పంటితో కొరకడం గుర్తు
సమయం చాలా గడిచిపోయింది
ఇంకా నువ్వు నేను తిరిగిన ప్రదేశాలు గుర్తు
ఆనాటి యవ్వనపురోజులు ఇంకా గుర్తు
వేసవి ఎండలో నేను పిలిచినందుకు
నువ్వు పాదరక్షలు లేకుండా పరుగున రావడం గుర్తు
పరదాల మాటున నన్ను తేరిపార చూడడం గుర్తు
నువ్వు అలగడం నేను అలక తీర్చడం గుర్తు
నీ చేతి గాజుల గలగలలు గుర్తు
నీ చెవికున్న జుంకాల మిలమిలలు గుర్తు
ఆనాటి యవ్వనపురోజులు ఇంకా గుర్తు
విడిపోయే సమయంలో కన్నీరు నిండిన నీ కనులు గుర్తు
వీడుకోలు చెప్పే సమయంలో నీ పెదవులు కంపించడం గుర్తు
భావాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖాన్ని
కొంగులో దాచుకోవడం గుర్తు
ఆనాటి యవ్వనపు రోజులు ఇంకా గుర్తు
- అరుణ డేనియల్, 9000606889