Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి..... గాంభీరం,
మనసు.... సుమధురం,
తెలుగు సాహితీ నగరాల్లో
నడయాడిన ''కవన సుధాకరుడు''
అతడు జాషువ అక్షర వారసుడు,
వర్గరూపేణ వాదం హారం మోసిన,
ఆయనకు అందరూ సాహితీ బంధువులే...!!
తెలుగు వచన కవితా వాకిట,
చిత్ర కవితా రంగవల్లులద్దిన,
ఆంధ్రసభా వీధుల్లో
అనర్గళ ప్రసంగ ప్రవాహంగా మారిన,
''ఎండ్లూరి'' ముద్ర ఎవ్వరూ కాదనలేరు,
''వాదం'' అనే చట్రం వల్ల...
నేనాయన పరిశోధక''శిష్య రేణువు'' కాలేక పోయినా!!
ఆయనంటే నాకు ఎంతో ఇది !
నా అక్షరమన్నా ఆయనకు అదే ఇది !!
నా గురుదక్షిణ ''అక్షరదక్షిణ'' కు.... ఆయన అందించిన
''వాత్సల్య అభినందన'' లే
దానికి రుజువు.
సహచరి దివికేగిన దుర్ధినం మొదలు,
పున్నములులేని పూర్తి అమాసల జీవితం తనది,
తనను ఆవహించి అర్ధాంగి చెంతకు చేర్చమని,
కరోనాను సైతం కరాలు సాచి ఆహ్వానించిన ......
''అమరసతీ వల్లభుడు'' ఈ
అక్షర ప్రేమికుడు,
హేమలతమ్మ చెంతకు
సేదకై ఏగిన.. ఓ.. ఎండ్లూరి!!
మీ అక్షర ఆశయాల దారే
మా... అందరి రహదారి.
(డా|| ఎండ్లూరి స్మతిలో ...)
- డా|| అమ్మిన శ్రీనివాస రాజు, 7729883223