Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనసంతా గాలిస్తుంది
నా పునర్జన్మ ఎక్కడని
లోకమంతా అలుముకున్న చీకటి
అంటురోగంలా అణువణువు పాకుతుంది
మనిషిగా పుట్టిన
మతతత్వం వెంటాడి చంపుతుంది
దూరమైన ఆనంద బాష్పాలను
అప్పు అడుగుతున్న కనురెప్పలు
మూసిన గదులు తెరవలేక
సూర్య చంద్రులతో పోరాడుతున్న
నా సమస్య పరిష్కారించమని
అయినా వినరే...
రెండు చుక్కలు రాల్చమని మేఘాన్ని
పొత్తికడుపులో దాయమని భూ తల్లిని
వేడుకుంటున్న నా అంతరాత్మ
నన్ను వదిలి పోతానని మారాం చేస్తుంది
బొందల గడ్డ మీద రాసుకున్నా పాట
తన్నుకొస్తోంది ఆఖరి నిమిషంలో
బొడ్రాయి ఫక్కున నవ్వింది
నాలో నటన బయటపడి
అంతలోనే ఆహ్వానం అందింది
మట్టి దుప్పటి ముసుగుతో
గంధపు చెక్కల పలకరింపు
బాణసంచా వెలుగుల్లో
శాశ్వత రంగులెలా వస్తాయి
- అశోక్ దుర్గం, 8106709871