Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవే గుప్పెడు భావాలు
అవే గుండెడు బంధాలు
అవే గంపెడు స్వప్నాలు
అవే కడివెడు కన్నీళ్లు
అవే యాభైయారు అక్షరాలు
అవే అరిగిపోయిన ఎంగిలి పదాలు
అవే కథలు... అవే జీవితాలు...
పదే... పదే... అవే... అవే...
కొత్తగా ఏమైన చెప్పగలమా?చేయగలమా?
పోయినోల్లు చెప్పిందానికి పొల్లు అయిన చేర్చగలమా? మార్చగలమా?
అనంత కాలాలు
లెక్కలేని జన్మాలు
సమాధులైన లోకాలు
సమాధానం లేని ప్రాణాలు
యిక చాలు... యిక చాలు...
ప్రాణాల్నుండి కాలాల్ని తోడేస్తాను
కూడికలతో వేసిన పూడికలను తోసేస్తాను
కూడికలతో కూడని పరిపూర్ణతను
తీసివేతల్తో పూరిస్తాను
యిక స్తబ్దతే నా కవిత
నిశబ్దతే నా కథ
విశ్వాల్ని నింపినా వొంపేసుకునే నిండైన ఖాళీనే.. నేను..!
- ప్రమోద్ వడ్లకొండ, 9739422236