Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాయంత తెలివైనవాళ్ళు లేరని అనుకునేది కానీ
పల్లె తల్లి ఒడి నుండి పట్నంలో
అడుగు పెట్టినాక తెలిసింది
తెలుసుకునేది శాన్నేఉందని
బ్యాచులర్ రూమ్ కోసం
కాళ్ళు అరిగేలాగ తిరిగినా
ఫ్యామిలిలకు మాత్రమే బోర్డులు
వెక్కిరిస్తూ నవ్వుకునేవి
అడ్వాన్స్ అద్దెతో ,షరతుల ఒప్పందాలతో
ఓ రూమ్ దొరికితే
అదే మాకు ఇంద్ర భవనం,
పండుగ ,పబ్బాలు లేకున్నా
మా రూమ్ కి రోజు చుట్టాలే..
అమ్మ మూటకట్టి పంపిన మామిడికాయ తొక్కు,మార్చి నూరిన కారంపొడి,రొట్లో నూరిన చింతకాయ పచ్చడి ఇది మాకు నోరూరించే బిర్యానీలు
దోస్త్ గాని పుట్టినరోజు కోసమని వాటలేసుకుంటే గాని రాని కేక్ కోసం
ముందు రోజు నుండేవ్యూహాలు ..
పిలవని పేరంటాలు, పెళ్లి దావతులు
అన్నింటికీమేమే ఆహ్వానితులం
కర్రీస్ పాయింట్లు మాకోసం
ఆరా తీసి ఆకలి తీరుస్తాయి
పండుగలకోయేచ్చిన దోస్త్ బ్యాగ్ లో
తనిఖి చేస్తేగాని తనివితీరదు
నెల ఆఖరోస్తే అద్దె తిప్పలు
రూము దాటనీయని ఖాళీ జేబులు
ఇక్కడ ఎన్ని కష్టాలు ఉన్నా
మా ఆరాటం అంతా
ఉన్నత భవిష్యత్తు కోసమే...
- పల్లె రాజుగౌడ్, 9666207288