Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత సమాజంలో
మామూలే..!
నాలుకలు
ఊరికనే జారిపోతాయి...!
సామాన్యులే కాదు...
రాజులు సైతం
అప్పుడప్పుడు
జారవిడుస్తూంటారు..!
కాకపోతే
సామాన్యులు అవగాహన లేమితో
రాజులు అధికార దర్పంతో
ఇక్కడ...
జారిపడ్డ ప్రతి నాలుకకు
ఓ లెక్కుంటుంది..!
వ్యక్తిని బట్టి..
జారిన తీరునుబట్టి..!
అది..
గుండెలు కోయగలదు...
రాజ్యాంగాలు మార్చగలదు..!
అప్పుడప్పుడు
జారవిడుచుకున్న వ్యక్తికి
ప్రాణసంకటం కానూవచ్చు..!
ఏమో ఎవరికి తెలుసు..! అసలే...
'' జారే నాలుకకు పదునెక్కువ..!''
- కోగిల చంద్రమౌళి,
9573187218