Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిక్ నోటితో కలం పట్టుకుని, చిన్నగా పొడుచుకు వచ్చిన, చిన్నపాటి సర్జరీ చేయబడిన పాదం రెండు వేళ్ళతో పేజీలు తిప్పుతూ చదువు ప్రారంభించాడు. ఒక వెడల్పాటి స్కేటర్ పై ఒరిగిపోయి గదులన్నీ తిరిగేవాడు. అందరి పిల్లలతో పాటు పాఠశాల ప్రవేశం పొందడానికి అతడి తల్లిదండ్రులు న్యాయస్థానంలో పోరాటం చేసి గెలిచారు. పదేండ్ల వయసులో ఆత్మన్యూనతా భావంతో 'నేను మాత్రమే ఇలా ఎందుకు ఉన్నాను. నిస్సహాయంగా కనిపిస్తూ, దూరంగా నిలిచిపోయే తోటి విద్యార్థుల ఎగతాళి మాటలకు చూపులకు కుంగిపోయి స్నానం చేసే టబ్‌లో మునిగిపోయి చనిపోవడానికి ప్రయత్నించాడు' అని చదువుతున్నప్పుడు మన మనసు, కళ్ళు చెమరుస్తాయి.
సమ్మెట ఉమాదేవి విశ్రాంత ఉపాధ్యాయిని. ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా విధులు నిర్వహిస్తారు. అక్కడి విద్యార్థులు వారి జీవన విధానాలను నిశితంగా పరిశీలించిన ఆమె వారి కష్టనష్టాలను ''అమ్మ కథలు, రేల పూలు, తండావాసుల కథలు, జమ్మిపూలు, ఉమాదేవి కథానికలు'' వంటి కథా సంపుటాల ద్వారా బాహ్యా ప్రపంచానికి తెలియజేశారు. పాఠకులకు దగ్గరగా ఆ బాలల జీవితాలను తీసుకొచ్చారు.
గిరిజన పిల్లలు, వారి మనసులకు దగ్గరగా రావడం వల్ల బాలసాహిత్యంలో తనదైన ముద్రతో సృజనాత్మక రచనలు చేస్తున్నారు. ''అల్లరి కావ్య, పిల్లలదండు, నిజాయితీ, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర, ఏమి చేస్తారు -ఏమేమి చేస్తారు, చిలకపలుకులు'' ఇవన్నీ బొమ్మల కథల పుస్తకాలుగా వెలువరించారు.
సమ్మెట ఉమాదేవి వెలువరించిన 'నిక్ అంటే ప్రేరణ-నికోలస్ జేమ్స్ వుయిచిచ్ విజయ గాధ'ను సప్తవర్ణాత్మక సచిత్ర కథనంగా వెలువరించి తన పాఠకులను విస్మయపరిచారు.
నిక్ ప్రపంచవ్యాప్తంగా ప్రేరణా దాయక ప్రసంగాలు చేసే వారిలో మూడవ స్థానంలో ఉన్న వ్యక్తి. అంతో ఇంతో నిక్ గురించి విని ఉన్న వారికి కూడా పూర్తిస్థాయిలో ఈ పుస్తకం నిక్ జీవితాన్ని ఆసాంతం కన్నుల ముందు ఉంచుతుంది. చదివిన పాఠకుడికి మొదట కళ్ళు చెమరుస్తాయి. అద్భుతం అన్న మాటలు పెదవులమీద నిలుస్తాయి. మెదడులోని అణువణువు నిక్ అబ్బురపరిచే జీవిత సంఘటనల తాలూకు ఆనంద విషాదాలు నిండిపోతాయి.
జీవితంలో చలన అవయవాలు లేని ఒక వ్యక్తి సాధించిన విషయాలు విజయాలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. మనసును అల్లుకున్న విషాదం మబ్బులు క్రమంగా విడిపోయి అతడి జీవితం ఇచ్చే సందేశం అనే తెలివి, భానుడి కిరణాలు మనల్ని ఉత్తేజితం చేస్తాయి
ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు గురువులు తోటి విద్యార్థులు సమాజం పాత్ర గురించి చైతన్య పరుస్తాయి.నిక్ వురు చిచ్కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడటంలో అతని స్వయం కృషి కుటుంబ తోడ్పాటు బలమైన ముద్రలు పాఠకులు మనస్సులలో వేస్తాయి. అమ్మ స్పర్శ కోసం వెచ్చదనం కోసం ఆకలి తీరడం కోసమో శిశువుగా రోదన స్వరం వినిపిస్తున్నాడే తప్ప, నిక్ తానుగా కదిలించడానికి, ఆడించడానికి అతడికి కాళ్ళు చేతులు లేవు.హతాశులైన తల్లిదండ్రులు తమ మొదటి సంతానం తొలి చూపులోనే ఒక రకమైన వికారానికి గురయ్యారు. నిక్ అలా పుట్టడానికి 'టెట్రా ఫోకోమెలియా సిండ్రోమ్' వ్యాధే కారణం. ఇది ప్రపంచంలో కోటి మందిలో ఒకరికి వచ్చే వ్యాధి ఇది కొన్నాళ్ళు మందులు వాడితే తగ్గే జబ్బు కాదు. ఏ పని స్వయంగా చేసుకోలేని, కృత్రిమ అవయవాలు అమర్చుకోలేని శరీరం. అలాంటి శిశువును మనో నిబ్భరంతో తల్లిదండ్రులు, బోరిస్, దుష్కాలు అతనికి చీర్ లీడర్స్‌గా మారిపోయారు.
నిక్ నోటితో కలం పట్టుకుని, చిన్నగా పొడుచుకు వచ్చిన, చిన్నపాటి సర్జరీ చేయబడిన పాదం రెండు వేళ్ళతో పేజీలు తిప్పుతూ చదువు ప్రారంభించాడు. ఒక వెడల్పాటి స్కేటర్ పై ఒరిగిపోయి గదులన్నీ తిరిగేవాడు. అందరి పిల్లలతో పాటు పాఠశాల ప్రవేశం పొందడానికి అతడి తల్లిదండ్రులు న్యాయస్థానంలో పోరాటం చేసి గెలిచారు
పదేండ్ల వయసులో ఆత్మన్యూనతా భావంతో 'నేను మాత్రమే ఇలా ఎందుకు ఉన్నాను.నిస్సహాయంగా కనిపిస్తూ, దూరంగా నిలిచిపోయే తోటి విద్యార్థుల ఎగతాళి మాటలకు చూపులకు కుంగిపోయి స్నానం చేసే టబ్ లో మునిగిపోయి చనిపోవడానికి ప్రయత్నించాడు' అని చదువుతున్నప్పుడు మన మనసు, కళ్ళు చెమరుస్తాయి అయితే ఆ ప్రమాదం నుంచి రక్షింపబడ్డాక, తల్లిదండ్రుల మరింత ఆప్యాయత అనురాగాలు గుర్తించి తానే ''నాకు కాలు చేయి విరిగి అవకాశమే లేదు ...అవి ఉంటే కదా' అని తనపై తనే జోక్ వేసుకుని స్థాయికి,తన సానుకూల దృక్పథం ఏర్పరచుకున్నాడు నిక్.
పాఠశాల స్థాయిలోనే చక్కగా సంభాషణ చేసే గుణం,అతడి అభివ్యక్తీకరణ కౌశలం గుర్తించిన ఒక ఉపాధ్యాయుని ప్రోత్సాహం నిక్ జీవిత విధానాన్నే మార్చివేసింది. తన 19వ ఏట ''సౌతాఫ్రికాకు వెళ్లి అక్కడి అనాధలకు తాను దాచుకున్న డబ్బు అందజేస్తాను'' అన్నాడంటే.. అది ఎంతటి అనూహ్యమైన మార్పో కదా నిక్ లో.తన 21వ ఏటనే డబుల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
నిక్ -తన జీవితం చాలా మందికి ప్రేరణ కలిగిస్తుందని గ్రహించాడు. తన కన్నీళ్ళను కూడా స్వయంగా తుడుచుకోలేని వ్యక్తి -అటువంటి జీవితాన్నే గడిపే వారికి ''మీ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించండి. మిమ్మల్ని మీరు నమ్మండి, ప్రేమించుకోండి, గౌరవించుకోండి, సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి'' అని విదేశాలలో స్పూర్తివంతమైన ప్రసంగాలు చేసి మీడియా, ప్రపంచ దృష్టిని ఆకర్షించి స్వీయానుభవాల రచయితగా మారడం వెనుక, అతడి కృషి పట్టుదల ఆత్మవిశ్వాసం పాఠకుల్ని కట్టిపడేస్తాయి. అతడు తనలోని ఆశనీ ధైర్యాన్ని, ఆయుధాలుగా మార్చుకున్న క్రమంతో, అతడికి మరింత చేరువ అవుతారు పాఠకులు. నిక్ జీవితం- మనకు సంతోషకరమైన జీవితాన్ని సాకారం చేసుకోవడానికి, ఆచరణాత్మక మార్గాలను ఎవరికి వారే అన్వేషించు కోవాలని బలంగా చెబుతుంది. 'లైఫ్ వితౌట్ లిమిట్స్' అనే పుస్తకం 30కిపైగా భాషల్లోకి అనువాదమై అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. నిక్కు వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. కాని అతని సాహిత్యానికి ఎల్లలెక్కడివి. అందుకే ప్రపంచమంతా అణువణువూ చేరింది. యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిందంటే అతియోశక్తి కాదు.
మూడు అడుగుల మూడు అంగుళాల మనిషి, ప్రపంచాన్ని ఆకట్టుకునే మాటల మాంత్రికుడు కావడం వెనుక గల విభ్రమ కలిగించే అతడి జీవన క్రమంలోని ఎన్నో విషయాలను నిశితంగా పరిశీలించి, ఫోటోలను సేకరించి ప్రేరణాదాయకమైన పుస్తకంగా ప్రచురించడం వెనక రచయిత్రి ఉమా దేవి పడ్డ శ్రమ కూడా తక్కువేమీ కాదు. నిక్, కానే మియహారాలు పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకుని నలుగురు సవ్యమైన సంతానాన్ని పొందడం మరొక మహాద్భుత విషయం. నిక్ వర్తమాన ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకడంటే ఆశ్చర్యం కలగక మానదు. నిక్ గురించి మనం ఎందుకు తెలుసుకుని తీరాలో, ఒక ఇరవై లక్షణాలను సూచీ బద్ధం చేశారు గ్రంథం చివరలో రచయిత్రి ఉమాదేవి.
వెల 250 రూపాయలు 128 పేజీలు.
రచయిత్రి మొబైల్ నెంబర్ 9849406722
- మల్లేశ్వరరావు ఆకుల 7981872655