Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాత్రి వాహనాలన్ని ఇంటికెళ్ళాయి .
కానీ పుట్ పాత్ పైకి ఎవరోస్తారో తెలియదు.
కడుపులో ఖాళీలను పూరించడానికి
ఈ లోకం ఏ ఒక్క అవకాశం ఇవ్వను లేదు .
ఆకలిని వెతికి వెతికి
అలిసిన కన్నులు
కునుకు కోసం దారి వెతుకుతున్నాయి .
ఈ దేశం చేసిన సంతకాల చట్టాలు
రోజూలాగే తన ఖాళీ సంచిలో నింపుకోవడానికి వెళితే
చెత్త కుప్పలో విరివిగా దొరికాయి .
అయిన తనకేం తెలుసు
బడి లేదు బలపం లేదు .
అలా
ఆ కాగితాలను పరుపుగా
ఇటుక పెళ్లను దిండుగా జేసుకున్నాడు .
తన ఖాళీకడుపుపై చేయి తడుముతూ
మెల్లగా నిదురలోకి జారుకున్నాడో లేదో
లోకమంతా గందరగోళం సాగుతున్నది .
అయిన నిదుర బాగానే వచ్చేసింది .
మెల్లగా
తాను నేరమేమి చేయకుండానే
ఒంటినిండా బట్టలు ధరించినట్టుగా ,
కమ్మగా అమ్మ తన లేలేత బుగ్గలపై
ముద్దులు పెట్టినట్టుగా,
బడిలో గురువు తన భుజాన్ని నెమురుతుంటే చప్పట్లు కురిసినట్టుగా ,
సాయంత్రానికి కొన్ని సీతాకోకలు ,
తనతోటి దోస్తులందరు ఆకాశానికి వేలాడే
ఊయలలో ఊగినట్టుగా,
కల వచ్చేసింది.
బహిరంగంగా లోకమేమో
కలలు కూడా మా సొంతమే అన్నట్టుగా
నిదుర చెడగొట్టేందుకు అరుస్తూనే ఉన్నది.
అయిన ఆకలిని మరిపించిన కలతోనే సాగుతున్నది ఆ హదయం.
ఇంతలో అటుగా
జీవన తాత్వికతను మోసుకు తిరుగుతున్న
ఓ కూశ్ పిల్ల వచ్చి
మనకు అంత సీన్ లేదని
తన పక్కను మెల్లగా తడిపేసింది.
లేచి చూస్తే
వీధి లైట్ కింద కిటకిటలాడుతున్న కీటకాలు
ఎక్కడో చీకట్లో కనపడకుండా లోకాన్ని తిడుతున్న పురుగులు.
ఇంతలో తన కళ్ళలోకి చూస్తూ
ఆ కుక్కపిల్ల వికటాట్టహసంతో తోకను ఆడిస్తూ
దేశం అంటే ఏమిటి ?
ఇంతకీ నీది ఏ దేశం అని ప్రశ్నిస్తూ
పక్కనే ఉన్న చెత్తకుండీ వైపు తీసుకుపోయింది.
ఇంతకీ నాది ఏ దేశం.
- రామ్ పెరుమాండ్ల,
9542265831