Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎనిమిది దూలాల ఇల్లుండి ఏం
లాభం ఉరవిష్కలకున్న స్వేచ్ఛ లేనప్పుడు...!!
ఎంత మంది దొరసాని అని పిలిచి ఏం లాభం ఇంటి దర్వాజ కూడా దాటనప్పుడు..!
గుమ్మానికి పచ్చని మామిడాకులు కట్టి
ఏం లాభం పట్టే మంచం మీద ఒరిగే స్వేచ్ఛ లేనప్పుడు....!!
చిక్కుడు తీగల చాటుకు నక్కిన చిక్కుడు గుత్తులెన్నో..
కట్టుబాట్లతో పరద సాటుకే పరిమితమైన ఆడ బతుకులెన్నో....!!
కట్టుకున్న వాడితో మాట్లాడాలంటే సీకటి పడాలి
కన్న వాళ్ళతో సెప్పుకుందామంటే పొలిమేర దాటాలే...!!
ఇంట్ల మురికి నీళ్ళు పోనీకి తూపురం ఉన్నదని...!!
ఆడదాని కన్నీళ్లు ఆపనికి తొవ్వ లేకపాయే...!!
ఎన్ని దుఃఖాలు సూసిన కండ్లు అమెవి...!!
ఆమె కళ్ళలో స్వప్నాల కంకులని కాయీస్తే కష్టాలు పిట్టల్లా వచ్చి ఒలుచుకుపోతాయీ...!!
- తుమ్మల కల్పన రెడ్డి, 9640462142