Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రక్తమాంసాలున్నా
మెదడున్నా
రాగమున్నా
ద్వేషమున్నా
హృదయమున్నా
అవేవీ కావు... కావు... కావు...
మా కొలమానాలు...
ఏదో ఒకటి ఎందుకు కావు నువ్వన్నదే
మా అనుమానాలు...
లయ తప్పిన హార్మోనేదో
నీ బతుకుని శాశిస్తుంది
మెటాబలిక్ డిజార్డరేదో
నీ బతుకిని బజారు కీడుస్తుంది
నీ తప్పిదమేమీ లేకుండానే
నీ బతుకుని ఛిద్రం చేస్తుంది
బిడ్డవి కావు పొమ్మంటుంది అమ్మ
కొరివి పెట్టే కొడుకువి కావు
పొమ్మంటాడు అయ్య
అసలు మనిషివే కావు... కావంటుంది లోకం
రంగు తక్కువనే భరించలేని వాళ్ళం
పరాయి మతం వాడినే సహించలేని వాళ్ళం
ఎత్తుతగ్గితే మరగుజ్జులంటామ్
ఎత్తుపెరిగితే ఎద్దులంటామ్
లావైతే గున్నలంటామ్
మరీ లావైతే దున్నలంటామ్
ఆకారం సరిలేకపోతే
అష్టావక్రులంటామ్
అనాకారివంటామ్
జండర్ తప్ప
మనిషిని నిర్వచించలేని
మరో డైమెన్షన్
తెలీని మేం
నిన్నెలా బతకనిస్తామ్?
'తేడా' వంటూ గేలి చేస్తాం
'మాడా' వంటూ హేళన చేస్తాం
ప్రకతి విరుద్ధానివంటూ
కుళ్ళబొడుస్తాం
నువ్విప్పుడొక
ఛిద్రమైన బతుకు శకలానివి
ఎవ్వరికీ పనికిరాని శిథిలానివి
అందమైన కాన్వాస్ మీద
ఒలికిన సిరా మరకవు
సష్టి ధర్మాన్ని ధిక్కరించిన నిషిద్ధ ప్రాణివి
మనిషిని మనిషిగ చూసే
వివక్షత లెరుగని సమాజ మొకటుంది
నిన్ను నిన్నుగా బతకనిచ్చే
'బతుకు' నిచ్చే
అందమైన సమాజమది
చైతన్యమై రగులు
బావుటావై వెలుగు
పోరుబాటలో నడువ్!
- వి.విజయకుమార్, 8555802596