Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్టాలు... ప్లస్.. కన్నీళ్లేనా ఆడదంటే,,,?
తెలుగు సీరియళ్ల ధారావాహిక ఆడదంటే..??
చిటికెడు... పసుపు.. కుంకుమ.. పసుపు తాడే కాదు ఆడదంటే
ఆడదంటే బాధ్యత..... బానిస.. అలుసు.. సింగారం...శృంగారం..
ఈ నిర్వచనాలకి.. కాలం చెల్లు..
ఈ భాష్యాలకి చెదలు పట్టా...
ఇవ్వని కాగితాలపై ఒలికిన ఇంకు బుడ్డి మరకలు మరకలు..
నిజంగా ఇవన్నీ ఆడదాని జీవితానికి పట్టిన గోమారి పురుగులు..
ఇప్పుడు.......!!!!!
ఆడవాళ్ళ గొంతుకు
మగవాళ్ళు డబ్బింగ్ చెప్పే రోజులు పోయాయి
తెరవెనుక మగవాళ్ల ప్రామ్టింగ్కు
ఇక కాలం చెల్లు..
అమ్మగా ఆధారపడాలని
చెల్లిగా చెప్పింది వినాలని
ఆడదంటే అనగి ఉండాలని
శాసించే మగ మహారాజులు
రాజ్యాలు కోల్పోయిన బికారులు అయ్యారు..
ఇక నుంచి మా జీవితాలకు
కథ.. మాటలు.. పాటలు.. స్క్రీన్ప్లే మేమే..
ఇక మాకు కొత్త ''చలం'' అక్కర్లేదు.
కొత్తగా సవరించిన చట్టాలు కావాలి.
ఇక మా జీవితాలకు కర్తలం.. భర్తలం.. విధాతలం.. మేమే
పెగులుతున్న మా గొంతుక
సరికొత్త రాగం.. తాళం.. పల్లవి..
- వై.సుజాత ప్రసాద్, 9963169653