Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ తెలంగాణ కవి అన్నవరం దేవేందర్ రాసిన తెలుగు కవితలల్ని "The Unyielding sky''అనే కవితా సంకలనం పేరుతో ఎంతో అద్భుతంగా అనువాదం చేశారు డాక్టర్ మంతెన దామోదరాచారి. దేవేందర్ రాసిన మాండలిక పదాల్ని సాంప్రదాయిక భాషను, రోజువారీ వాడుక పదాల్ని ఎక్కడ అర్థమార్పిడి కాకుండా ఇంగ్లీషులోకి అనువదించారు. కవిత్వ భాషకి అవసరమైన పదాల్ని అర్ధవంతంగా రాసి తన కవిత్వానికి అంతర్జాతీయ తను సాధించు కున్నాడు అన్నవరం. దేవేందర్ అలవోకగా వాడిన ఊహా చిత్రాలు, పదచిత్రాలు, రూపకాలు చదివితే తన వ్యక్తిగత సాంఘిక, తాత్విక, ప్రాపంచిక వాస్తవ దక్పధాన్ని తెలియ పరచటమే కాకుండా ప్రపంచంలోని కవిత్వ ప్రేమికులందరు తన కవిత్వంతో మమేకమవుతారు.
ఈ కవిత్వ సంకలనంలోని కవితలు వాటంతటవే పాఠకుల హదయానుభూతుల్ని, మనసులోని భావోద్వేగాలను చాలా పదునుగా దగ్గరగా ఆవిష్కతం చేస్తాయి. ఈ కవి కవిత్వరచనా విధానం మామూలుగా అనిపించినా అందులోనే ఆయన కవిత్వ విన్యాసం, రచనా కౌశలం కనిపిస్తది. ఉదాహరణకు ఈ ''వంగని ఆకాశం'' సంకలనంలో సముద్రవర్ణన వాస్తవానికి విశాల వాస్తవ ఊహాజనిత వక్రీకరణ పాఠకుల మనసులో తలకిందులై తిరిగి కనిపిస్తది.
కొన్నిసార్లు అన్నవరం తన చుట్టూఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ తన కవిత్వం ద్వారా సూక్ష్మాతిసూక్ష్మమైన విషయాన్ని నీ మనసులో ముద్రిస్తాడు. అతని కవితలన్ని దేనికవే రంగురంగుల చిత్రాలుగా కనిపిస్తూ అన్ని కలిసి ఒక చిత్రంతో ఇంకో చిత్రం మమేకమై ఒక అద్భుతమైన కళాత్మక వస్త్రంలా కనిపిస్తుంది.
అన్నవరం దేవేందర్ ఈ సంకలనంలో కవిగా తనను తాను వెతుక్కునే మహాప్రయాణికుడిలా కనిపించి తన కవిత్వ పారిబాష పదాల్ని వాటి అర్థాల్ని తన కవిత్వానికి అనుగుణంగా మలుచుకునే అక్షరశిల్పి. అతని వ్యక్తిగత కవితల్ని పరిశీలించినట్లయితే తన చుట్టూ ఉన్న వస్తున్న సామాజిక మార్పులు, వ్యక్తులు, తన తల్లి తండ్రి మిత్రులు, పుట్టినవూరు ఆయన మీద గాఢమైన ప్రభావం కనిపిస్తుంది. తన తండ్రి క్రమశిక్షణ, తల్లి త్యాగం, కోల్పోయిన మిత్రులు, మారిపోయిన పల్లెటూళ్ళు అన్ని కలిసి తన కవిత్వం రాటుతేలటానికి కారణభూతులైనాయంటాడు.
ఈ అనుభవాలన్నీ అన్నవరాన్ని ఒక సంపూర్ణ వ్యక్తిగా, ఒక ప్రామిస్సింగ్ కవిగా నిలబెట్టాయి. ''అక్షరాల సొరంగంలోంచి ఎగురుతున్న నేనొక కవితావాక్యాన్ని అంటాడు. తన కవిత్వాన్ని నిర్వచించుకునే క్రమంలో...తనకు అబ్బిన ఈ కవిత్వకళ ఎంతోమంది ఉన్నతుల నుంచి, తన తండ్రి నుంచి, తనకిష్టమైన కవులనుంచి , తన ముందు తరం కవుల నుంచి, సాహిత్య చరిత్ర నుంచి అంటాడు. తను కవిగా ఎదగడానికి ఎన్నో కారణాలు చేబుతూ...ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, గ్లోబలైజేషన్, పరాయికరణ, పర్యావరణ కాలుష్యం, అధునాతన టెక్నాలజి, దేవేందర్ కవిత్వం తన చుట్టూ ఎండిపోతున్న చెరువులు.. రోజురోజుకు ఊర్లల్లో మాయమైపోతున్న వనరులు.. కంప్యూటర్ల వల్ల మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులు.. అంతమై పోతున్న సహజ అరణ్యాలు... మారుతున్న స్నేహితుల కత్రిమ మనస్తత్వాలు... తన చుట్టూ ఉన్న మనుషుల నడవడిని.. ఆధునిక భౌతిక వాదాలు ఎలా సమా జాన్ని నాశనం చేస్తున్నవో చాలా సునిశితంగా పరిశీలించే కవిగా తన కవితల్లో ప్రతిబింబిస్తాడు.
ఈ వంగని ఆకాశం సంకలనంలో దేవేందర్ కవిగా తన అంతరంగాల్లో ఉన్న ఆలో చనలకు సరియైన రూపమిచ్చిన కవిత్వంగా చెప్పుకోవచ్చు. కవి త్వాన్నీ వివరణాత్మక వస్తువుగా చేసుకొని ప్రపంచాన్ని అందు లోని మనుషుల్ని పరిశీలిస్తాడు. ఆ పరిశీలనలో వాళ్ళల్లో మార్పులు ఎలా తీసుకురావచ్చో చెబుతాడు.కవిఅనేవాడు అక్షరాలతో బొమ్మ గీయడమే కాదు ఆబొమ్మల్లో తన అంతరంగాలోచనల్ని ఆవిష్కరించుకుంటాడు. అందుకే దేవేందర్ ఇలా అంటాడు ''నేను అక్షరాలను కవితాక్షేత్రంలో చల్లి కవిత్వపు పంట పండిస్తాను''. ఈ ఒక్క వాక్యంతో తనకున్న వ్యవసాయ అనుభవాన్ని, ఆయన కవిత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు.
అన్నవరం దేవేందర్ ఈ ''వంగని ఆకాశం'' ఆంగ్లానువాద సంకలనాన్ని అనుసజన చేయడంలో డాక్టర్. మంతెన దామోదరాచారి సామాజపరమైన ముందుచూపు, మేధోపరమైన నైపుణ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ ఆంగ్ల గ్రంధం "The Unyielding sky'' తప్పకుండా తెలుగేతర కవిత్వ ప్రేమికులందరి ప్రశంశలు పొందుతుందని ఆశిస్తున్నాను.
ఆంగ్లం : విన్సెంట్ స్టెడ్ (ఆస్ట్రేలియా కవి)
తెలుగు అనువాదం: డాక్టర్ బాణాల శ్రీనివాసరావు