Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పురాతన వీధి లో నుంచి నన్ను పిలవకు
భాధలో మునిగిన విషాద గీతం వినిపించకు
అశ్రుపూరితమైన కవిత వినిపించకు
విరిగిన మనసును ఇంకా విరగగొట్టకు
గతించిన దినాల జ్ఞాపకాలలో
పురాతనమైన రాగాన్ని నేను మరిచాను
ఒక క్రొత్త మజిలీకి నేను చేరుకున్నాను
పాత ఉనికి నేను మరిచాను
ఆ పురాతన హదాయాన్ని విడిచాను
ఆ పురాతన ధర్మాన్ని విడిచాను
పాప ప్రక్షాళన చేసుకున్నాను
పురాతన బంధనాలు తెగిపోయాయి
ఏ సంకెళ్లు నా కాళ్లకు లేవు
అద్దం లాంటి మనసులో ఏ బొమ్మ లేదు
అన్నిటినుంచి విముక్తి పొందాను
జీవితం మారిపోయింది
ప్రపంచం మారిపోయింది
మనసుకు విలువైన జ్ఞాననిధి దొరికింది
నాలో నాకే క్రొత్త మనిషి ఆవిష్కరించాడు
క్రొత్త దారిలో పయనం కొనసాగిస్తున్నాను
మలినం కడిగేసుకున్నాను
శాంతి మంత్రం జపిస్తున్నాను
ఇపుడు నాకు నేనే క్రొత్త గా కనిపిస్తున్నాను
- అరుణ డేనియల్, 9000606889