Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలవాటే కదా!
ఓటు చూపు కళ్ళు
మరణం కోరలు చాచినమాటలు
మతం చాటు
మీ మనసువికారాలు కొత్తకాదు
నా కురులు కనిపిస్తే
మీ కళ్ళ ల్లోంచి మత్తిల్లిన తుమ్మెదలు దుంకుతాయి
నా కురులు చూపించను
అల్లాహౌ అక్బర్! అల్లాహౌ అక్బర్!!
నా మొఖం చూస్తే
మీ నోట్లోంచి చంద్రుడు సొళ్ళై కార్తాడు
నా మొఖం కనిపించనీయను
అల్లాహౌ అక్బర్! అల్లాహౌ అక్బరు!!
నా హదయం మీద
మీ చూపులు గుచ్చి గుచ్చి
నా మనసు నెత్తురోడ్తున్నా
వికతానందమత్తులో దొర్లుతారు
నా హదయం చూపించను
అల్లాహౌ అక్బరు!అల్లాహౌ అక్బర్
నా వీపు మీద
మీచూపులు కుప్పకూలి మురుగు వాసనేస్తాయి
నా వీపుకు వెల్తురు రాయను
అల్లాహౌ అక్బర్!అల్లాహౌ అక్బర్
నా నడుము మీద
మీ కళ్ళు చేసే నెత్తురు చిప్పిల్లని గాయల్లెన్నెన్నో
నా నడుము చూపించను
అల్లాహౌ అక్బర్!అల్లాహౌ అక్బర్!!
ఇంకా
ఇసుక తిన్నెల ఊహాగానాలు రానీయను
అరటిబోదేల ఆలోచనలు మీకివ్వను
లైంగికాంక్షల లాంతరువెలుగునై
మీ చీకటి ఆలోచనల ఆవరణలో సంచరించలేను
అల్లాహౌ అక్బర్!అల్లాహౌ అక్బర్!!
ఉన్మాదవీర్య ప్రవాహ వీరత్వ కాలంలో
మీ బానిస సీతనై
జైశ్రీరామ్ బుల్లిబాయిలారా!
మీ అగ్ని ప్రాజెక్టులో దూకలేను
నేనే
నిరసన నిర్మాణం గానో
నడచి వస్తున్న నర పేలుడు రూపంలానో
నీ కళ్లల్లోకలలు వణికితే
నా మనసంతా విరబూస్తుంది పూలతో కానీ
నా అక్షరాల్ని నా పుస్తకాల్ని నా భవిష్యత్తును
నాచేతుల్లోంచి లాగేసుకొని
నా జీవితకాలాన్ని
నాలుగ్గోడలకు దిగ్గొట్టాలని
మీ కల కాబోలు
ఐతే
నా తలవస్త్రం తల్వారై
మీ వెంటబడకేంచేస్తుంది
- వడ్డెబోయిన శ్రీనివాస్,
9885756071