Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేదోడు దాసుకున్న నాలుగు పైసలు ఓడగొట్టనీకి అచ్చేవే ''పండగలు''...!!
ఉన్నోడికి యాడదంతా ''ఉగాదే''...!!
సంవత్సరాలు మారిన పేదింట్ల కొత్త నవ్వుల ''పూత'' పూయదే...!!
రోజు కారే కన్నీళ్ళ ధారలో ''ఉప్పు'' రుచి తెలియంది కాదు మాకు....!!
పొద్దాక కట్టపడి కంచంల ''కారం'' వెతుకుల మింగనీకే....!!
మా భవిష్యత్తు ఆశలన్నీ పక్కేసి, దుప్పట్లో దూరి ''తీపి'' కలలు కనుడువరకే.....!!
తెల్లారితే రోజు రోజుకు పెరిగే ధరలు ఎక్కిరిస్తు ''చేదు'' కబురు పంపవంటే...!!
వసంత ఋతువు మాకు ''వగరు'' లాంటిదే....!!
''మామిడాకుల'' బరువు కూడా మోయలేని గుమ్మాలు మావి...!!
కూసే కోయిలకేం తెల్సు మింగుడుపోని పేదోళ్ళ బతుకు రాగాలు....!!
పైసలను బట్టి రుచులనట్టు మాకు కొత్తేం కాదు ఈ ఉగాది ''రుచులు'' ....!!
శుభకత నామ సంవత్సరం గుండెల్లో శూలాలు కుచ్చకుంటే చాలు....!!
- తుమ్మల కల్పన రెడ్డి,
9640462142