Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతులు
ఏ పంట పండించినా కొనాలనే
స్పహ ఉండదా
ఏటు తిరిగి
రావిచెట్టు చుట్టేనా ప్రదక్షిణలు
అన్నములో రాళ్ళుంటే
ఏరేసి తింటం
అన్నాన్ని పడేయం
చేపలకు చెరువులు తొవ్వాలి గాని
గాలాల్ని తయరు చేయడం ఏమిటి
గాలిపటాలకు
దారాలు కావాలిగానీ
కత్తులకు శాసనాలుచేస్తెట్ల ?
రాయిలో రాముని
నదిలో పుష్కరుణ్ణీ పూజిస్తివి
గాలిలో దేవుని కొలిస్తివి
చెట్టులో పుట్టలో పాలుపోసి భక్తితో కొలిచి
అన్నం పెట్టిన అమ్మనాయినలకు
మొండిచెయ్యి చూపిస్తున్నవు
వాళ్ళు
ఆర్థికవేత్తలు కాకపోవచ్చు
సైంటిస్ట్, మేధావులు కాకపోవచ్చు
ఇంజనీర్, కలెక్టర్లు కాకపోవచ్చు
డాక్టర్ యాక్టర్ లీడర్లు కాకపోవచ్చు
ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాకపోవచ్చు కానీ
అందరి కాళ్ళ కింద భూమెట్ల ఆధారమో
మీ కడుపుల కింత అండగా రైతులు
లోపల నవగ్రహాలు
భయట దశావతారాలు
అందులో రైతెవడు లేడు
మార్గాలను అన్వేషించండి
తూనీగల్లా దారిని వెతకండి
దారికీ దీపాలు కండి
భయపెట్టి శాసించి చెలామణికాకండి
నూకలని బియ్యమని అవమానించకు
రైతు దోసిలిలోనిదేదైనా ప్రసాదమే !
భయం భయం భయం
దేవున్ని నమ్మాల్నా పూజారిని నమ్మాల్నా
బాబాని నమ్మల్నా అమ్మవారిని నమ్మల్నా
మంత్రాన్ని నమ్మల్నా తంత్రాన్ని నమ్మాల్నా
ఎవరి కాళ్ళాకాడ కొబ్బరికాయకొట్టినా
పరుశరాముడై వెంటాడుతున్నడు వేటాడుతున్నడు
పగలు చల్లదనమే
రాతిరి చల్లదనమే
మదగజాల మల్లయుద్ధంలో
పావురాల ఊపిరాడక గుండెలు ఘోషిస్తున్నవి
నవధాన్యాలలో వడ్లుకూడ ఒక ధాన్యమే
రైతుల ధాన్యానికి విముక్తి కల్పించండి
- వనపట్ల సుబ్బయ్య, 9492765358