అసలే మట్టి చేతులతో నిండిన హైదరాబాద్ బస్తీ అందులో నిడకు కూడ చేమటపటించే ఎండాకాలం
పేరుకు గొంతుతాడిపేవి మంజీర నిల్లే కానీ నల్లాలకు రోజులతరబడి ఎదురుచూపుల దండలు వెయ్యాల్సిందే
సాయంత్రం ఐతే రాత్రైనా ఇంటికిరాని కొడుకు గురించి చూసినట్టు మంచినీళ్ళ గురించి ఎదురు చూస్తరు
బోరునీల్లు విడిచేది గంటసేపే ఒచ్చేదే ఇంటికి రెండు బిందలే పుస్తకాలలో చదువుకున్న కురుక్షేత్రాన్ని రోజు ఇంటి ముందుట చూస్తుంటం
దేవుని దర్శనానికి లైన్ కట్టినట్టు ఏ గల్లీలో చూసినా ప్లాస్టిక్ బిందలు పట్టుకొన్న వాళ్ళే
మంచ్చిలు రాంగనే గల్లినిండ పెళ్లి సందడి మొదలైతది పండగొలే ఇల్లంతా మెరిసేట్టు కడుగుతరు
వారం రోజుల బట్టలన్నీ ఇంటిముందు ఏసుకొని పాలపొంగొలే నురుగొచ్చేదాక సరుపులో ఏసిన బట్టలకు నలిచినదాక మనసు పట్టదు
రోజు వాకిళ్ళు కడిగి చుక్కల ముగ్గేసిన నిళ్లోచ్చిన రోజే వాకిళ్ళు తనివితీరా స్నానామడతై బట్టలు విండీన నురుగుతోనే మురికిని వొదిలించుకుంటై
డ్రుమ్ముల కాడికెల్లి చిన్న సర్వల దాకా నీళ్ళ పండుగ చేసుకుంటయి రాత్రికి ఒండే అన్నంకి బియ్యం కూడా ఇప్పుడే కడిగి పెట్టుకుంటరు
పనులన్నీ చేస్తుండగనే నీళ్ళు బందైతయి మల్ల ఎప్పుడొస్తయోనని పక్కింటోలతోటి ముచ్చట్లు పెట్టుకుంటుంటే నాలుగురోజులు నీళ్ళు రావంట అని సూర్యుడు నవ్వుకుంట చెప్పిపోతడు