Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరించిన పల్లెటూర్ల చుట్టూరా
జీవితాలను త్యాగం చేసిన నిలువెత్తు జాడలు
యవ్వనం పువ్వులై రాలిన ఆకృతులు
వాళ్లు వాళ్ల కోసం జన్మ నెత్తలేదు
అందుకే అక్కడన్నీ లేచి నిలిచిన తల పువ్వులు
కొండలు కోనలు అడవుల నిండా
చిమ్మచీకట్లోనూ కాళ్ళ అచ్చుల కదలికలు
ఆ పాదముద్రలే ప్రాణత్యాగ దీపాలు
చెట్టూ కొమ్మా ఆకూ అలమూ ఆధిపత్య పైత్యంపై
ఆయుర్వేద వైద్యం
ఆ పిల్లబాటటల నుంచి మళ్లీ
ఆచ్చాదనంగా సంచరిస్తే
అరి పాదాలకు ఇంకా తాకుతున్న అగ్నిస్పర్ష
ఆట మైదానం నిండా ఉపన్యాసాల ద్వని
గాలిలో తరంగాలై వ్యాపించిన విద్యుల్లతలు
ప్రహరీ గోడల మీదా మాసిపోని జాజు రాతలు
వసంతాలెన్ని వాడినా పదను పోని రసాత్మక వాక్యాలు
దూసుకుపోయిన తూటాలు, తెగిపోయిన కంఠాలు
చేనూ చెలకల్లో వాగు వంకల్లో నెత్తుటి చారికలు
ఊరు అడవి వక్షాలు ఒక యుద్ద చరిత్ర
చెట్ల ఆకుల్లోంచి ఇప్పటికీ కన్నీళ్ల భాష్పోత్సేకం.
- అన్నవరం దేవేందర్,
9440763479