కీ.శే. ఫీచర సునీతారావు ద్వితీయ వార్షిక పురస్కారాల కోసం కవిత్వం, కథలు, విమర్శాత్మక వ్యాసాలు మూడు విభాగాల నుండి రచనలను ఆహ్వానిస్తున్నట్టు అవార్డు కమిటీ పేర్కొంది. మార్చి 2019 నుండి మార్చి 2022 మధ్య వెలువడిన రచనలే పంపాలని, మూడు విభాగాలలో ఎంపికైన ప్రతి సంపుటానికి రూ.15000 నగదు పురస్కారం ఉంటుందని కమిటీ పేర్కొంది. రచనలు పంపాలనుకునే వారు మే 18 లోగా టి.మన్మోహన్ రావు, ఇ.నెం. 1 - 5 - 431/2 / 16, రామేశ్వర్ నగర్ కాలనీ, జొన్నబండ, ఓల్డ్ అల్వాల్ - 500010 అడ్రస్‌కు పంపాలని, వివరాలకు 9848698699 నంబరుకు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.