Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌
  • కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ
  • ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
హార్పర్‌ లీ రాసిన నవల ''టు కిల్‌ ఏ మాకింగ్‌ బర్డ్‌''..! | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి

హార్పర్‌ లీ రాసిన నవల ''టు కిల్‌ ఏ మాకింగ్‌ బర్డ్‌''..!

Mon 25 Apr 01:22:27.612563 2022

              హార్పర్‌ లీ కలం నుండి వెలువడిన ''టు కిల్‌ ఏ మాకింగ్‌ బర్డ్‌'' అనే నవల గురించి తెలుసుకోవడం అంటే అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఉన్న మేకోంబ్‌ అనే ఓ చిన్న పట్టణంకి వెళ్ళడం, అక్కడి నల్లజాతి ప్రజలపై జరిగిన వివక్షాపూరిత సంఘటనల్ని తెలుసుకోవడం. అంతేకాదు ఒక శ్వేత జాతీయుడైన లాయర్‌ తన సమకాలీన పద్ధతుల్ని కాదని నల్ల జాతీయుని కోసం న్యాయపోరాటం చేసినందుకు తోటి శ్వేత జాతీయుల నుంచి ఎదుర్కొన్న వ్యతిరేకతని గుర్తుచేసుకోవడం. నిజానికి మేకోంబ్‌ అనే పట్టణం పేరు కాల్పనికమైనదే అయినప్పటికీ అక్కడి సంఘటనలన్నీ నాటి అమెరికాలో ముఖ్యంగా దక్షిణాది ప్రదేశాల్లో నిత్యకత్యంగా జరిగినవే.
              ఈ నవల 1960లో ప్రచురితమైనది. అయితే కథ మొత్తం 1933-35 మధ్య కాలంలో జరుగుతూంటుంది. రచయిత్రి హార్పర్‌ లీ తాను పుట్టిన మన్రోవిల్లే (అలబామా) ప్రాంతంలో జరిగిన అనేక సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ నవలని నిర్మించింది. దీనిలోని పాత్రలన్నీ నాటి అమెరికా సమాజంలోని వాస్తవాల్ని మనముందు కళ్ళముందు చూపెడతాయి. నల్లజాతి వివక్ష ఆనాటి సంఘంలో ఎంత ఘోరంగా ఉండేదో ఈ నవలలో తెలుసుకో వచ్చు. అయితే కారుణ్యంతో పాటు ఈ రచనలో హాస్యాన్ని ఇంకా సంస్కరణ అభిలష త్వాన్ని రచయిత్రి చక్కని శైలిలో అందించారు.
              అసలు మాకింగ్‌ బర్డ్‌ అనే పేరుని రచయిత్రి ఎందుకని టైటిల్‌ లో పెట్టడం జరిగింది అంటే... ఆ పక్షి ఆ దక్షిణాది అలబామా ప్రాంతంలో చాలా సాత్వికమైన, అమాయకంగా సంగీతం పాడుతూ అందర్నీ అలరించే మంచి పక్షిగా పేరెన్నికగన్న ప్రాణి. దాన్ని అందరూ ప్రేమతో చూస్తారు. అయితే అలాంటి మంచి ప్రాణిని సైతం చంపే మనుషులు ఈ లోకంలో ఉన్నారు. దాన్ని తలపించే ఒక నల్ల జాతి యువకుని పాత్రయే టాం రాబిన్సన్‌. మరి అలాంటి యువకుడు ఎందుకని చంపబడ్డాడు... అతడిని కాపాడడానికి అటికస్‌ అనే శ్వేతజాతి న్యాయవాది ఎలా ప్రయత్నించాడు వంటి ఎన్నో విశేషాల సమాహారమే ఈ నవల.
              ఈ నవల అంతా ఒక జ్ఞాపకంలా సాగుతుంది. అంటే స్కౌట్‌ ఫించ్‌ అనే ఆమె తన చిన్నతనంలో ఒక మాదిరి పట్టణమైన మేకోంబ్‌లో నివసించే సమయంలో అక్కడి విశేషాలు ఎలా ఉండేవో చెబుతుండగా మనకి కథ నడుస్తూంటుంది. సరే... మనం కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోదాము. అది మేకోంబ్‌ అనే చిన్న పట్టణం, ఎప్పుడూ నిద్ర పోయినట్లుగా ఉంటుంది. అక్కడ గొప్ప విషయాలు ఏమీ ఉండవు. అయితే ఉన్నంతలో బాగా ఉంటుంది. ఒక స్కూల్‌, చక్కటి ఇళ్ళు, పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్రదేశాలు ఇలా కొన్ని ఉన్న పట్టణం. స్కౌట్‌ అనే ఈ అమ్మాయి ఫించ్‌ కుటుంబంకి చెందినది. ఆ ఊళ్ళో ఆ యింటి పేరు వాళ్ళు చాలా మందే ఉంటారు. అప్పుడు స్కౌట్‌కి ఆరేళ్ళు కాగా ఆమె సోదరుడు జెరెమె.. సరే అతడిని జెం అంటారు... అతనికి పదేళ్ళు. స్కూల్‌లో చదువుతూ, ఆటలు ఆడుకుంటూ హాయిగా గడుపుతుంటారు.
              వాళ్ళ నాన్న పేరు అటికస్‌. భార్య చనిపోయింది, మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. తను లాయర్‌ వత్తిలో ఉన్నాడు. ఆ ఊళ్ళో కాస్తా కలిగిన కుటుంబం అని చెప్పాలి. గ్రేట్‌ డిప్రెషన్‌ ప్రభావం ఈ ప్రాంతం మీద కూడా ఉన్నది. అయినా బండి అలా సాగిపోతూంటుంది. అలా ఉండగా డిల్‌ అనే కుర్రాడు ఈ ఊరిలో ఉన్న వాళ్ళ బంధువు ఇంటికి వచ్చినపుడు, స్కౌట్‌తోనూ, జెం తోనూ స్నేహం ఏర్పడుతుంది. ముగ్గురూ కలిసి ఆడుకుంటూ, ఓసారి బూ రాడ్లీ అనే ఆయన ఇంటికి సమీపంగా వెళుతూ ఎలాగైనా ఆ యింటిలోకి వెళ్ళాలని ప్లాన్‌ వేసుకుంటారు. ఎందుకంటే ఈ బూ రాడ్లీ ఎప్పుడూ బయటకి రాకుండా ఇంట్లోనే కాలం గడుపు తుంటాడు. అసలు ఇతగాడు కేరక్టర్‌ ఏమిటి అని ఈ ముగ్గురిలో ఆసక్తి మొదలవుతుంది. ఊళ్ళో కూడా బూ రాడ్లీ అంటే దెయ్యం లాంటి వాడని ఎన్నో పుకార్లు షికారు చేస్తుంటాయి.
              ఇతరుల జీవితంలో ఎన్నో ఉంటాయని వాటిని వాళ్ళ కోణంలో చూస్తే తప్పా అర్థం కావని తండ్రి అటికస్‌ తన పిల్లలకి చెబుతాడు. మళ్ళీ ఎండాకాలం లో డిల్‌ ఊరిలోకి వచ్చినపుడు ముగ్గురు పిల్లలు బూ రాడ్లీ ఇంటిలోకి వెళ్ళే ప్రయత్నం చేయగా, ఒక పిష్టల్‌ శబ్దం వినిపించడంతో పారిపోయి వచ్చేస్తారు. జెం దుస్తులు చిరిగిపోతాయి తప్పించుకునే సమయంలో..! ఆ తర్వాత కూడా ఈ పిల్లలు ఆ యింటి మీద నుంచి వచ్చేటప్పుడు, అక్కడున్న చెట్టు తొర్రలో కొన్ని బహుమతులు పెట్టి ఉండటం గమనిస్తారు. అలా మరికొన్ని సార్లు జరుగుతుంది. అయితే బూ రాడ్లీ మంచివాడే అనిపిస్తుంది వాళ్ళకి. ఓసారి ఫైర్‌ ఆక్సిడెంట్‌ జరిగినపుడు తన మీద దుప్పటి వేస్తాడు రక్షణగా... స్కౌట్‌ అనుకుంటుంది అది బూ రాడ్లీ అని.
              అటికస్‌, ఒక నల్లజాతి యువకుడు టాం రాబిన్సన్‌ మీద మోపబడిన ఓ నేరం విషయంలో అతని తరఫున వాదిస్తుంటాడు. ఒక శ్వేత యువతిని మానభంగం చేశాడని అతనిపై గల అభియోగం. టాం రాబిన్సన్‌ మీద కొందరు శ్వేత జాతీయులు కావాలని నేరం మోపారని అటికస్‌ భావిస్తాడు. తోటి తెల్లవాళ్ళంతా అటికస్‌ని తిడుతుంటారు, ఒక తెల్లవాడివై ఉండి నీగ్రోకి సపోర్ట్‌ చేస్తావా అని. జాతి కంటే ముఖ్యంగా సత్యం గెలవడమే తనకు ప్రధానమని అటికస్‌ అంటాడు. స్కూల్‌లో కూడా తోటి పిల్లలు ఈ విషయమై స్కౌట్‌ ని, జెం ని తిడుతూంటారు. అయినా వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడతారు.
              టాం రాబిన్సన్‌ మీద కోర్ట్‌లో వాదనలు మొదలవుతాయి. తెల్లవాళ్ళంతా కలిసి అటికస్‌ ఇంటి మీదకి వస్తారు. స్కౌట్‌ చిన్నపిల్ల అయినప్పటికి తన వాదంతో వాళ్ళనందర్నీ ఒప్పించి వెనక్కి పంపిస్తుంది. రేప్‌కి గురయిందని చెప్పబడే మేయెల్ల ఏవెల్‌ అబద్ధం చెప్పిందని, అలాగే ఆమె తండ్రి బాబ్‌ ఏవెల్‌ కూడా దాంట్లో పాత్రధారి అని అటికస్‌ కోర్ట్‌లో ఆధారాలతో సహా నిరూపిస్తాడు. దాంతో కోర్ట్‌, నల్లజాతి యువకుడిది తప్పులేదని చెప్పి, అంతలోనే అతగాడిని కొన్నాళ్ళు జైల్‌లో పెట్టమని చెబుతుంది. జడ్జ్‌లు అంతా తెల్లవాళ్ళు కావడంతో వివక్ష చూపిస్తారు. దానితో నీగ్రో యువకుడు టాం రాబిన్సన్‌ పారిపోవడానికి ప్రయత్నించి పోలీసుల తుపాకికి బలవుతాడు.
              అంతవరకు న్యాయవ్యవస్థలో ఎంతో నమ్మకమున్న ఫించ్‌ కుటుంబీకులకి న్యాయం అనేది తెల్లవారికి వేరుగా, నల్లవారికి వేరుగా ఉందని తేటతెల్లమవుతుంది. స్కౌట్‌, జెం లాంటి పిల్లలకి సైతం కోపం వస్తుంది. బాబ్‌ ఏవెల్‌ పగతో రగిలిపోయి హాలోవీన్‌ పార్టీకి వెళ్ళి వస్తూన్న అటికస్‌ సంతానం మీద దాడి చేస్తాడు. అయితే బూ రాడ్లీ అదే సమయానికి వచ్చి బాబ్‌ని చంపుతాడు. ఆ ఊరి షరీఫ్‌, అబద్ధం చెప్పి బూ రాడ్లీని చట్టం నుంచి రక్షిస్తాడు. చెట్టు మొదలు దగ్గర తన కత్తి మీద తానే పడి ఏవెల్‌ చనిపోయాడని చెబుతాడు.
              స్కౌట్‌ తోనూ మిగతా వాళ్ళతోనూ మాట్లాడిన తర్వాత బూ రాడ్లీ మళ్ళీ తన ఇంటిలోకి వెళ్ళిపోతాడు. తను మళ్ళీ బయటకి రాగా నేను చూడలేదు అంటూ స్కౌట్‌ చెబుతుంది. ఆ విధంగా కథ ముగుస్తుంది. తండ్రి చెప్పినట్లు, ఇక ఎప్పుడూ ఎవరినీ వాళ్ళ గురించి తెలుసుకోకుండా అభిప్రాయం ఏర్పరుచుకోకూడదని ఆమె అనుకుంటుంది.
              అమెరికన్‌ కోర్ట్‌లు సైతం ఆ రోజుల్లో ఎలా నీగ్రోల పట్ల వ్యవహరించేవి అనేది ఈ నవల్లో చెప్పబడింది. దక్షిణాది రాష్ట్రాల్లోని జీవనశైలిని, ఆనాటి ప్రజల రోజువారీ వ్యవహారాల్ని ఒక చిన్నపిల్ల కోణంలో నుంచి చెప్పడం జరిగింది. రచయిత్రి హార్పర్‌ లీ తన జీవిత లోని అనేక సంఘటనల్ని ఈ నవల్లో చేర్చినట్లు చెబుతారు. ఆమె తండ్రి కూడా అటికస్‌ లాగే నల్లజాతి వారి హక్కుల కోసం కషిచేసిన లాయర్‌. ఆమె జన్మించిన మన్రోవిల్లే కూడా రెండు వర్గాల ఘర్షణకి కేంద్రంగా ఉన్న ప్రదేశాల్లో ఒకటి. 1962 లో ఈ నవల సినిమాగా మలచబడినప్పుడు అకాడమీ అవార్డ్‌ని పొందింది. ప్రతిఒక్కరు చదవవలసిన పుస్తకాల్లో ఒకటిగా బ్రిటీష్‌ లైబ్రరీస్‌ సంస్థ వర్ణించింది. మోడర్న్‌ అమెరికన్‌ క్లాసిక్‌గా ఈ రచనని హైస్కూల్‌, మిడిల్‌ స్కూల్‌లో ప్రవేశపెట్టారు. పులిట్జర్‌ బహుమతిని సైతం పొందింది. 1964 తర్వాత నుంచి హార్పర్‌ లీ ఏ పబ్లిసిటీని ఆశించకుండా జీవించి, 2016లో మరణించారు.

- మూర్తి కెవివిఎస్‌
  7893541003

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్వేచ్ఛ - ఫాసిజం - కాల్పనిక సాహిత్యం
సమాజాన్ని 'పంచనామా' చేసిన కవిత్వం
తొలకరి
మెరుపు గింజలు
ఖరీదైన సమయం
నేనేమీ పాపం చేశానురా..
సాహితీ వార్తలు
ఉద్యమ కంఠస్వరం - కపిల రాం కుమార్‌ కవిత్వం!
కులదురహంకార హత్యలపై ఒక ఆలోచనాత్మక నవల మధులతా
శిలావీ పె(క)న్ను మూత
కరకరలాడే గడుసుకథల మిక్చర్‌ పొట్లం
హెన్రీ డేవిడ్‌ థోరో అరణ్య కుటీరం ''వాల్డెన్‌''
'రావణ మరణం తర్వాత' ఓ గందరగోళం
శేషేంద్ర భావాంతరంగం
సాహిత్య విమర్శ - ఒక పరిశీలన
గౌతమీ తీర జీవన అనుభవం
మాదిగ ఖాకీ మార్పుకు మూలమలుపు
సమాజాన్ని ఎక్స్‌రే తీసిన కథలు
పైసలతో సోపతి
సలపరింతల గాయాల పలవరింతే ''పరావలయం''
కొత్త కవులకు దివిటీ దిక్సూచి
అన్నపురెడ్డి పల్లి అవార్డ్స్‌ - 2022
తెలుగు బాలగేయ సంకలనాల ప్రచురణ
ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌ ప్రతిభా పురస్కారాలు
సూర్య హోళీ
అమృతం
ఇది రాజకీయ కవిత కాదు
అనుభవం ముఖ్యం కనుక...
దుఃఖనదిలో అశ్రుపడవ
విలాపం నుండి విలాసంలోకి ... 'కాల ప్రభంజనం'
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.