అనుభవం ముఖ్యం కనుక మాటల, చర్యల నిర్మాణం మీద శ్రద్ధ చూపించేదెవరు? ఒకవేళ చూపిస్తే నేను నీకు పెట్టిన ముద్దు సమగ్రమైంది కానే కాదు
ప్రపంచంలో వసంతం నెలకొని వున్నప్పుడు నిండు మూర్ఖత్వంతో ఉండటం అది
ఓ నా చిగురుబోడీ! విజ్ఞానాన్ని కలిగివుండటం కన్న ముద్దు పెట్టుకోవడాన్ని ఉత్తమమైన పనిగా అంగీకరిస్తుంది నా రక్తం అని ప్పువ్వులన్నిటి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఏడవకు, నీ కనురెప్పల కదలిక ముందు నా మెదడులో పుట్టిన అత్యుత్తమ చేష్ట బలాదూరు
నాకు నువ్వూ నీకు నేనూ అని చెప్తుంది అది కాబట్టి, నా చేతులలో వాలిపోయి నవ్వులొలికించు ఎందుకంటే జీవితం ఒక పారాగ్రాఫ్ కాదు
చావు కుండలీకరణం కాదని కూడా భావిస్తాను
ఆంగ్లమూలం : ఇ. ఇ. కమింగ్స్ తెలుగు అనువాదం : ఎలనాగ