- సాహితీ వార్తలు 'ఆజాదీకా అమృత మహోత్సవ్' సందర్భంగా 'తెలుగు బాల గేయాలు' పేరుతో సంకలనాలు తీసుకు వస్తున్నట్లు సంకలనకర్త పత్తిపాక మోహన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో బాల గేయాలు లేదా బాలల దేశభక్తి గేయాలు రాసినవి, చదివినవి, నచ్చిన ఇతర కవులవి ఎంచుకోవచ్చు. ఒక్కరికి ఐదుకు మించి పంపకూడదు. ఆసక్తి కలిగిన వారు జూన్ 1లోగా గరిపల్లి అశోక్, 404, వి ఎల్ ఆర్ రెసిడెన్సీ, సిద్ధార్థ స్కూలు వెనుక, శ్రీనివాస నగర్, సిద్ధిపేట - 502103 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9849649101 నంబరు నందు సంప్రదించవచ్చు.