Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాతబట్టలు ముల్లెలుగట్టే మల్లిగానికేం ఎర్క పైసలు గూడ ఒత్తి ఒత్తి ముల్లెలు గట్టెటోల్లుంటరని...!!
తపుకుల పచ్చడి మెతుకులు తినే పోషవ్వకేం తెల్సు, ఎండి కంచంల అన్నం తినేటోల్లు వేల మందున్నరని..!
ఎడ్లకి గడ్డేసే తిరుపతన్న సూడలే మనుషుల్ని కూడా గొడ్ల లెక్క సూసేటోల్లుంటరని..!
ఆర్నెల్లకోపారి గుడిసేసుకునే సూరికేం ఎర్క ఒక్కనికే ''ఆరు బంగ్లాలుంటాయని''....!!
నుల్క మంచంల ఓరిగే పిసనర్సక్కకి తెల్వదు, ఎత్తు పరుపులు ఎక్కనీకే ఎల్లలు దాటేటోల్లుంటరని...!!
మనిషి మనిషితో మాట్లడాలంటే పది రూపాయల లాభం సూడవట్టిరి...!
ఆడది మగాన్ని సాయం అడిగితే నాకేంటి లాభమనేకాడికి అచ్చింది మన సదువు....!
పల్క నల్లగుంటే ''సరస్వతని'' కళ్ళకద్దుకుంటరు... మనిషి నల్లగుంటే కన్నెత్తి కూడా సూడరు...!!
పూట గడవనీకి కొలువులు సేసెటోల్లు కొందరైతే, కొలువులమ్ముకొని కోట్లు కూడబెట్టేటోల్లు ఇంకొందరు..!!
పదవులతో పైసలు సంపాదించేవాళ్ళు ఆనాడు...!!
పైసలుంటేనే పదవులియ్యవట్టే ఈనాడు...!!
నువ్వు పైసలతో సోపతి సేసిన, నీ పానాన్ని మట్టిలో కల్పుడు మాత్రం ఖాయం....!!
(మనుషులతో సోపతి చేయ్ నువ్వు మట్టిలో కలిసే వరకు... అప్పుడు నువ్వు మా మనసుల్లో ఆకాశమంత ఎత్తులో ఉంటావు...)
- తుమ్మల కల్పన రెడ్డి, 9640462142