Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోపూరి శ్రీనివాస్ స్మారక కథల పోటీలు
రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో సింగిల్ పేజీ కథల పోటీలు కోపూరి శ్రీనివాస్ స్మారకంగా అతని తల్లిదండ్రులు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులు రూ.1500/-, రూ.1000/-, రూ.500/-లతో పాటు ప్రోత్సహక బహుమ తులుగా మూడింటిని ఎంపిక చేసి ఒక్కొక్కటికి రూ.300/- చొప్పున అందించనున్నారు. ఆసక్తి కలిగిన వారు చేతిరాత అయితే ఒక ఎ4పేజీ, డిటిపి చేసినది అయితే అరపేజీ మించకుండా జులై 15లోగా 'రమ్యభారతి' పోస్ట్ బాక్స్ నెంబర్.5, విజయవాడ-520001 చిరునామాకు పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. విజేతలకు ఆగస్టు నెలలో విజయవాడలో బహుమతి ప్రదానం ఉంటుందని రమ్యభారతి ఎడిటర్ చలపాక ప్రకాష్ పేర్కొన్నారు.
డా. ఎన్. గోపి గ్రంథాల ఆవిష్కరణ
ఈ నెల 26న ప్రముఖ కవి డా. ఎన్. గోపి 73వ జన్మదినం సందర్భంగా బహత్కవితా సంపుటి ''మనిషిని కలిసినట్టుండాలి'', డా. ఎస్. రఘు సంపాదకత్వంలో వెలువడే సాహిత్య విమర్శ, సమీక్షా వ్యాసాల ప్రత్యేక గ్రంథం ''నిరంతర'' గ్రంథాలను సాయంత్రం 5 గంటలకు, హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఆవిష్కరించనున్నారు. డా. వోలేటి పార్వతీశం అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ వంగల హర్షవర్ధన్, కె. రామచంద్రమూర్తి లు పుస్తకావిష్కరణ చేస్తారు. విశిష్ట అతిథిగా ఆచార్య సూర్యా ధనంజయ హాజరుకానున్నారు.
వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం-2022
40 ఏండ్లు దాటని యువ రచయితల నుంచి వేదగిరి రాంబాబు కథానికా పురస్కారానికి కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. విజేతలకు రూ.5000 నగదు పురస్కారం అందిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 14లోగా తమ కవితా సంపుటాలను సిహెచ్.శివరామ ప్రసాద్ (వాణిశ్రీ), స్వగృహా అపార్ట్మెంట్స్, సి బ్లాక్, ఎఫ్ 2, భాగ్యనగర్ కాలనీ, హైదరాబాద్ - 500072 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9849061668 వాట్సాస్ నంబరు నందు సంప్రదించవచ్చు.