Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుడిలోకి నన్నెందుకు రానివ్వవురా ..
నీ పాదాలకు రక్షణగా
ఉండే చెప్పునురా .. .
గుడి దగ్గర పరిమితులు నాకెందుకు రా.. .
నేను లేకుండా
అడుగు బయట పెట్టవు..
గుడి బయటే నన్నెందుకు విడిచి పోతావు..!
గుడిలోన కొబ్బరి చిప్ప
నీ కాలుకు గుచ్చుకుంటే..
నా గుండెకు గాయం కాదా..
అది చూసి నేనుండగలనా..
పెచ్చులూడిన రాయి
నీ కాలుకు గాయం చేస్తే
అమ్మ అని నీవు తల్లడిల్లుతుంటే..
నా కండ్లతో చూసి ఉండగలనా..
దేవుడి పాదాలు నీ తలపై
పెట్టుకుంటే ఒప్పు..
ఆ దైవ సన్నిధిలో
నేను కలియ తిరిగితే తప్పు..
ఇది ఎవ్వడు చెప్పిన నీతి..
నా పుట్టుక కడజాతి..
రాయిలో ఉన్న రూపము
కాపాడిందా నిన్ను చెప్పు..
నీ పాదాలకు అలంకరణ అయి
కాపాడుతుంది ఈ చెప్పు..
నీ పాదాలకు నేను రక్షా..
నిన్ను కాపాడలేని దేవుడి దగ్గర
నాపై ఎందుకు వివక్ష....!!
- అజయ్ కుమార్