Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ దేశంలో మనుషుల మలాన్ని తమ చేతులతో ఎత్తి మోసుకెళ్లి ఊరవతల పారబోసే వృత్తిలో పనిచేసే వారిని పాకీ వాళ్లని, సఫాయి కర్మఛారులని పిలుస్తుంటాం. నాగరిక సమాజంలో ఈ వృత్తి నిషేధించడం కోసం ఉద్యమాలు నడిచాయి. ఆ పనిలో జీవితాల్ని గడిపిన తల్లుల బతుకు చిత్రణే 'అశుద్ధ భారత్' అనే అనువాద రచన. హిందీలో భాషా సింగ్ రాయగా తెలుగులో ఎంతో హృద్యంగా అనువదించిన కాకర్ల సజయకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ప్రకటించారు. వారికి హృదయపూర్వక అభినందనలు...!!