Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నతనంలోని చిలిపి పనులు
సైకిల్‌పై ఎక్కిన ప్రయాణాలు
జారిపడిన మోకాలి దెబ్బలు
ఇంకా మరిచిపోనే లేదు
మరుపు రాని జ్ఞాపకాలు ఇంకా గుర్తుకొస్తున్నాయి!
వేసవి సెలవుల్లో ఈతలపోటి
చింత చెట్టెక్కిన నల్లని కోతి
బుజ్జిగాడు పెట్టిన బుంగ మూతి
ఇంకా మర్చిపోనే లేదు
మరుపురాని జ్ఞాపకాలు ఇంకా గుర్తుకొస్తున్నాయి!
అద్దంలా తళ తళ మెరిసిన కొలను
ఈతప్పుడు అంటుకున్న బంక మన్ను
భద్రంగా దాచుక్కున్న నెమలి కన్ను
ఇంకా మర్చిపోనేలేదు
మరుపు రాని జ్ఞాపకాలు ఇంకా గుర్తుకొస్తున్నాయి!
చదువులు నేర్పిన మా ఊరి బడి
పల్లె ప్రజలను కాపాడే దేవుని గుడి
గుండెను బరువెక్కించే కన్నీటి తడి
ఇంకా మరిచిపోనే లేదు
మరుపు రాని జ్ఞాపకాలు ఇంకా గుర్తుకొస్తున్నాయి!
- ఎస్.జవేరియా, 9849931255