Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక పుష్పం
సంపూర్ణంగా విచ్చుకునే వరకు
తదేకంగా చూపు మరల్చకుండా
చూశాను
అది
వళ్ళు విర్చుకుంటు
ఒక్కొక్క అంశను
నింపుకుంటుండగా
రెప్పవాల్చటం నా వల్ల కాలేదు
విచ్చుకుంటు, విచ్చుకుంటూ
పుప్పొడిని అమర్చుకోవడం
అదో విలాసం
సుగంధాన్ని వెదచల్లడం
ప్రారంభించాక
ఏ తుమ్మెదకు వశపడుతుంది
నిగ్రహం శిరచ్చేదం చేయకుండా
వుండటం సాధ్యమేనా? అని
పూల పరిమళం ముందు
విర్రవీగడం ఎవరితరం
ఔరా ! అనిపించింది.
- హనీఫ్