Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాసులు వరకూ ఎందుకు?
చివరకు కలలూ
ఎవరికీ ఊరకే రావు
ఊ అనగానే ఉరికి రావు
కునుకు బాట పట్టగనే
ఆ వెనకే అనుసరించి రావు
మెత్తని పరుపు హత్తుకుని
చీకటి దుప్పటి కప్పుకుని
కను రెప్పల గడియలు పెట్టుకుని
ఘడియలెన్ని గడిచినా నడిచి రావు
అవి నిన్ను వలచినప్పుడే
నీ దరికి వస్తాయి
అపుడు పిలవకున్నా నిను పలకరిస్తాయి
మంచివో, చెడ్డవో
కలలెప్పుడూ విలువైనవే
గాఢ నిదురకు ఏడు రంగులద్దేవి
ఈ లోకంలోనే నీ లోకాన్ని చూపేవి.
- డా. డి.వి.జి.శంకర రావు,
94408 36931
మాజీ ఎంపీ, పార్వతీపురం.