Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏంజరిగినా
మనకు మంచిదైతే చాలూ
ఎందరెందరూ నష్టపోయిన
మనకెందుకు?
స్వార్థం ముసుగులో
పయనం
పరమార్థం పరమాత్మకెరుక
పరులేమైతే మనకెందుకు?
మదిలో మౌనంగా నవ్వుతూనే
జాలికరమైన జుగప్సతో
రెప్పలిచ్చుకుంటారు
సందు దొరికితే
విషం గక్కుతుంటరు
మేలిముసుగుతీస్తే
మేడిపల్లే అన్నీనూ..
మాటలకు సైతం రంగేసి
ఎదుటివాడి ముఖానికి
విసిరికొడతరుజి
ఉసరవెల్లుల జాతికి వారసులేమరి
- సి. శేఖర్(సియస్సార్), 9010480557