Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె నవ్వులతో అలికిన ఇల్లు
అచ్చం ఆమె పోలికే.
ఆ పలకరింపులు
ఇంటిసిగలో ముద్దబంతులే..
కాలి మువ్వలసవ్వడితో
రోజూ పండుగ సందడే.
వడ్డించే చేతి చలువ
ప్రతి నోట పరిచయమే.
పొంగి పొర్లే ప్రేమ
ఆ ఇంటి సిరిసంపదలు.
ఆమెలా ఆ ఇల్లు
అచ్చం ఆమె ప్రేమకే ప్రతిరూపం.
- శ్రీ సాహితి
9704437247