Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యాయానికి కళ్లు గప్పి
అన్యాయానికి కాళ్లిచ్చి
చీకటిలో ఉండాల్సిన వాళ్లను
కటకటాల బయటకు పంపడం
విధివిలాపమా! పాలక విన్యాసమా!
రాజకీయమా వర్థిల్లు
మానవత్వమా మాయమైపో!
మనుజ ధర్మం రాముడు నేర్పితే
దనుజ ధర్మం రాజ్యమేలుతుంటే
పదకొండు మంది ధాష్టీకానికి
కన్నీరై ప్రవహించిన నిస్సహాయతకు
ఆనకట్టలు కట్టటానికి నీరేది?
అక్కా, చెల్లీ, అమ్మా, వదినా
ఎవరయినా సరే! ఆఖరుకు
అమ్మాయినా, నానమ్మయినా
అడిగన వాళ్ళకు కటకటాలు
చేసిన వాళ్ళకు పూలదండలు
బహుమానాలు!
ఇది రాముడి రాజ్యమా?
అవును
ఇది రాముడి రాజ్యం
- తాటికొండాల నరసింహారావు
9885787250