Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాఫీగా సాగిపోతున్న జీవనపయనంలో
హాయిగా సేదదీరుతున్న సంతోష వనంలో
కష్టాల మిన్ను విరిగి మీద పడ్డ,
సమస్యల సుడిగుండం
నిను సుడిగాలిలా చుట్టుకున్న,
కనుచూపు మేరలో కటికచీకటి అలుముకున్న,
నీ దరిదాపుల్లో వెలుగురేఖలు విచ్చుకోకపోయిన,
నీ హదయాగ్ని పర్వతాన్ని బ్రద్దలు కానివొద్దు..
కంటిని కన్నీళ్ల సంద్రంలా మారనివొద్దు
నువ్వే మాత్రం బాధల భూకంపానికి కుంగిపోవద్దు
ఊరికే పిరికి ఆలోచనలకు లొంగిపోవద్దు..
కటికచీకటి కాళరాత్రి పిదప
ఆనందరేఖల ఉషోదయం ప్రభవిస్తుంది
అతలాకుతలం చేసే పెనుతుఫాన్ తర్వాత ప్రశాంత వాతావరణం అలుముకుంటుంది
అగ్నిపర్వతం బ్రద్ధలై లావా ఉప్పొంగి చల్లారాక పరిస్థితులు చక్కబడతాయి..
ప్రతి సమస్యకు కాలమే
పరిష్కారం సూచిస్తుంది
ఆ కాలం రాకముందే అమూల్యమైన జీవితాన్ని చిదిమేయవద్దు
నీ అనుబంధాల పొదరిల్లులో
కన్నీటి సెగని రగలినియ్యెద్దు
జీవితాన అన్ని కోల్పోయినప్పటికి
ఒక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటే తిరిగి సంతోషాలు నీ వాకిట రంగవల్లులౌతాయి..
- సర్ఫరాజ్ అన్వర్, 9440981198