Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీకు ఇరవై, ఇరవై అయిదేళ్లు వుంటేనే
ప్రేమలో పడాలనే షరతు ఏమైనా వుందా ?
ప్రేమకు వయసు లేదు, తిక్కల్.
పదహారు ప్రాయం లాగానే
ఆరు పదుల వయసులోనూ
ప్రేమ అంతర్లీనంగా ప్రవహిస్తుంది.
అరవైలోనూ
హృదయం చాలా వగస్తుంది.
నువ్వు ఎవరినైనా కౌగిలించుకొన్నప్పుడు
ప్రేమదాహం గల వేళ్లు వణుకుతాయి.
అరవై లోనూ నీ హృదయంలో
ఒక ఉప్పెన వుంటుంది.
బురదను తొలగించి
తామరను అందుకోవాలన్న
తామసం చావదు.
నువ్వు కావాలనుకుంటే
వయసనే అక్కరలేని తీగను
దూకేయవచ్చు.
నువ్వు వయసు పైబడే కొద్దీ
వలపుమొక్క తరువుగా మారి
ఆకాశాన్ని తాకేదాక
హద్దుఅదుపు లేకుండా పెరుగుతుంది.
నా మాట తీసుకో..
వయసు ఎంతగా పెరుగుతుందో
నీలో ప్రేమ అంతకంత పెరుగుతుంది.
- తస్లీమా నస్రీన్
ఇంగ్లీషు : అషిమ్ చౌదరి
తెలుగు : పి.శ్రీనివాస్ గౌడ్, 9949429449