Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరణ్యానికి జనావాసానికి పెద్ద తేడా ఏం లేదు..!?
కొంచెం భయం వేసిన అరణ్యమే నయం...!?
పక్షులకి ఎగిరి స్వేచ్ఛ ఉంది
మనుషులకు కూడా ఉంటే ఎంత బాగుండు
అక్కడ నేను రాక్షసుడిని
ఇక్కడ నేను దేవుని
వేషం వేసుకున్న రాజులా ఉన్నప్పుడు లేని నొప్పి
మనిషిగా మారినప్పుడు ఎందుకు..?
నేనే విమానమైతే తప్పంటారు
విమానంలో ఒకడినై ఎగిరితే తప్పు కాదంటారు
రాజుకు బంటు ఉండొచ్చు
రాజే బంటులా ఉంటే తప్పు అంటారు
నీటి తాకిడికి రాయి కరుగుతుంది
రాయి తాకిడికి నీరు కరుగుతుందా
నాలో నేను మాట్లాడుకోవడం పిచ్చట
నాలో ఉన్నది మాట్లాడితే ద్రోహమట
హద్దు మీరితే తప్పయినప్పుడు
హద్దులో ఉండటం కూడా తప్పే కదా
భయాలకు బాధ్యత ఉన్నప్పుడు బానిసవటం తప్పదు
బానిస భయాల బాధ్యతలను త్యజించిన్నప్పుడు స్వేచ్ఛ
రోడ్డు కొలతల్లో ఇంటికి దూరం కిలోమీటర్
రోడ్డు లేనప్పుడు ఇంటి దూరం రెండు కిలోమీటర్లు
చుట్టూ చుక్కలు దూరంగా ఉన్నప్పుడు
పెద్దగా వెలుతురు లేదు
చందమామ దూరంగా ఉన్నా
ఎందుకో ఈరోజు వెలుతురు ఎక్కువగా ఉంది
నిజం చెప్పండి మీకు మీరు ఎంత దగ్గర
నిజం చెప్పనా
నాకు నేను చాలా దూరం
ఆ రోజు పాదాలకు స్పర్శ లేదు ఎందుకో తెలియదు
నన్ను నేను కోల్పోయాను
ఈరోజు నా పాదాలకు స్పర్శ ఉన్నా కూడా
నన్ను నేను కోల్పోయాను
బాధ్యతను బరువైన బానిసలా మోయటం గొప్పనా
బాధ్యతను తెలివైన బానిసలా త్యజించటం గొప్పనా
దూరం దగ్గరైనప్పుడు
దగ్గర దూరం ఎందుకు అవుతుంది??
జ్ఞానం పెరిగే కొద్దీ వయసు తరిగిపోవటం పెద్ద మిస్టేక్
భగవంతుడా నెక్స్ట్ టైం ఇలా అవనివ్వద్దు
వేరే గ్రహంలోనన్నా కొంచెం జ్ఞానం పెరిగే కొద్దీ
వయసు తగ్గేలా చూడూ
నీకు వినపడుతుందా...?
ఇది నిజమే కదా...
మనిషికన్నా అక్షరానికి జ్ఞానపు ఆయువు ఎక్కువే...!?
- అజయ్ మంకెనపల్లి, 9849089642