Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హంతక సంస్కార
మృగతనానికి దండలు వేశారు గదా!
హిట్లరు ప్రయోగాలా?
అత్యాచారాల దయ్యాలకు
ఆడతనం మీద రెడ్ కార్పెట్ పరుచారు గదా!
ఇంకేం, మదం కారిన
మారణ కాండల మత గజాలతో
ఈ దేశాన్ని తొక్కించండి
ఐ పీ సి నేరం యోని!
నెత్తురంటిన అంగాలకు
పురుశాంగరత్న అవార్డులివ్వండి
మనువు తొడల మీద
న్యాయస్థానాన్ని కూర్చోబెట్టావు
ఆలస్యమెందుకు
జాజు పట్టిన పురుశాంగ యాత్రలు చేయండి
క్షమాభిక్షకు
పురుశాంగమూ ప్రమాణమైంది
ధృత రాష్ట్రంలో
నువ్వెందుకు భయపడుతావు బిల్కిస్ భానూ
దేశాన్ని కదా
ఈ క్షమాభిక్ష
అత్యాచారం చేసింది
-వడ్డెబోయిన శ్రీనివాస్