Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ ప్రజలారా,
ఐక్యంగా అందరి బాగు కోసం కదలండి
మనందరినీ ఎప్పటికీ పెంచి పోషించేది అదే
ఆ ఉమ్మడినె మీదని అనుకోండి.
మరచిపోకుండా, ముందుకు సాగండి
మన బలం ఎక్కడ వుందో తెలుసుకోండి.
పస్తులతో అలమటిస్తున్నా లేక తింటున్నా
మరచిపోవద్దు, ముందుకే సాగిపోవాలి
అంతా జట్టుగా, కలసి కట్టుగా.
నలుపు, తెలుపు,గోధుమ, పసుపు
ఈ పాత వర్ణ విభేదాలను విడిచిపెట్టండి.
ఒకసారి మీ తోటివారితో మాట్లాడటం ప్రారంభించండి.
అందరూ కలిసిపోయే మనసు పుడుతుంది.
మన బలం ఎక్కడుందో మరచిపోకుండా,
ముందుకు సాగండి
పస్తులతో అలమటిస్తున్నాలేక తింటున్నా
మరచిపోవద్దు, ముందుకే సాగిపోవాలి
అంతా జట్టుగా, కలసి కట్టుగా.
ఇది నిర్ధారణ కావాలంటే
మీరు మీ మద్దతు మాకు అవసరం.
మీకు మీరుగా ఒంటరి పరుగులు తీస్తుంటే
మిమ్మల్నిమీరు కోల్పోతారు
మన బలం ఎక్కడుందో మరచిపోకుండా,
ముందుకు సాగండి.
పస్తులతో అలమటిస్తున్నా లేక తింటున్నా
మరచిపోవద్దు, ముందుకే సాగిపోవాలి
అంతా జట్టుగా, కలసి కట్టుగా.
మనల్ని ఏలుతున్న వాళ్ల గ్యాంగ్ అంతా
మన తగాదాలు ఎప్పటికీ ఆగవని ఆశిస్తున్నారు
మనల్ని విడగొట్టడానికి, మోసగించడానికి
వారు పైన ఉండి పెత్తనం చేయటానికి
మన విభేదాలే సహాయపడతాయని భావిస్తున్నారు .
మన బలం ఎక్కడుందో మరచి పోకుండా,
ముందుకు సాగండి
పస్తులతో అలమటిస్తున్నా లేక తింటున్నా
మరచిపోవద్దు, ముందుకే సాగిపోవాలి
ప్రపంచం కార్మికులారా, ఏకం కండి
మీ సంకెళ్ళు తెగిపోయే మార్గం అదే.
శక్తివంతమైన దళాలు పోరాడుతున్నాయి
ఇక ఏ నిరంకుశత్వమూ మిగలదు!
మరచిపోవద్దు, ముందుకే సాగిపోవాలి
పస్తులతో అలమటిస్తున్నా లేక తింటున్నా
తిరుగులేని ప్రశ్నలు వాళ్ళను చుట్టుముట్టె వరకు
రేపు ఎవరి రేపు కానుంది ?
ప్రపంచం ఎవరి ప్రపంచం కానుంది ?
(బెర్టోల్ట్ బ్రెక్ట్ సాలిడారిటీ సాంగ్ 1913 - 1956)
అనువాదం: డాక్టర్. యస్. జతిన్కుమార్