Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లుకున్న ఆశయాల పందిరి
అనుభవాలకు కాలం చెరిపేసిన దారుల వెంబడి
కాలిబాటల ఊటలు!
బూడిద కుప్పలో నుండి పునర్జీవించిన ఫీనిక్స్ లా!!
నిర్లక్ష్యాలకు నిండా మునిగిన మానవ సమూహాలు
నిబిడీకృతమై! నూతన వ్యక్తీకరణలను వెతుక్కుంటూ
నిర్దిష్ట ప్రయోజనాల కోసం చేసే పోరాటాలు
తర తమ ప్రధాన ఉనికిని చాటేందుకే!!
ఆకాశమంత స్వేచ్ఛ ఉన్న సముద్రం
ఎందుకు వెనక్కి వెళుతుందో!
జీవించడమే పోరాటం అయినంతగా
పోరాటమే జీవితం కాలేకపోతోంది!!
సాయుధ పోరాటానికిది సమయం కాకపోవచ్చు
అస్తిత్వ ఆకాంక్షల సాధన కోసం
తమదైన వ్యక్తిత్వాల్ని వదులుకొని
ఆరాటపడే శక్తిత్వాలు కనుచూపుమేరలో కానరావట్లేదు
వైయక్తిక వ్యత్యాసాలను పదిలపరచుకుంటూనే
ఉద్యమాల ఊపిరులకు అనవరతం ఊతమిస్తూ
నవ ప్రజా సమూహాలకు పురుడు పొయ్యాలి!
ప్రజాస్వామిక వేదికల భూమికల కొసప్రాణాలకు
కొసరి కొసరి ప్రాణవాయువునందించాలి!!
కొస ప్రాణాలు!
అల్లుకున్న ఆశయాల పందిరి
అనుభవాలకు కాలం చెరిపేసిన దారుల వెంబడి
కాలిబాటల ఊటలు!
బూడిద కుప్పలో నుండి పునర్జీవించిన ఫీనిక్స్ లా!!
నిర్లక్ష్యాలకు నిండా మునిగిన మానవ సమూహాలు
నిబిడీకృతమై! నూతన వ్యక్తీకరణలను వెతుక్కుంటూ
నిర్దిష్ట ప్రయోజనాల కోసం చేసే పోరాటాలు
తర తమ ప్రధాన ఉనికిని చాటేందుకే!!
ఆకాశమంత స్వేచ్ఛ ఉన్న సముద్రం
ఎందుకు వెనక్కి వెళుతుందో!
జీవించడమే పోరాటం అయినంతగా
పోరాటమే జీవితం కాలేకపోతోంది!!
సాయుధ పోరాటానికిది సమయం కాకపోవచ్చు
అస్తిత్వ ఆకాంక్షల సాధన కోసం
తమదైన వ్యక్తిత్వాల్ని వదులుకొని
ఆరాటపడే శక్తిత్వాలు కనుచూపుమేరలో కానరావట్లేదు
వైయక్తిక వ్యత్యాసాలను పదిలపరచుకుంటూనే
ఉద్యమాల ఊపిరులకు అనవరతం ఊతమిస్తూ
నవ ప్రజా సమూహాలకు పురుడు పొయ్యాలి!
ప్రజాస్వామిక వేదికల భూమికల కొసప్రాణాలకు
కొసరి కొసరి ప్రాణవాయువునందించాలి!!
- కరిపె రాజ్‌కుమార్, 8125144729