Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా జన్మే అమ్మ భాష
పిట్టగూళ్ళు కట్టుకున్న
అమ్మ మాటలకొంగింకా
నా వేలు చుట్టుకొనే ఉంది
బతుకు రెపరేపలాడే
భాషా సంద్ర యానం.
మా బతుకు పాటల వసంతాన్ని
నా నేలంతా అలికింది
మా అమ్మ భాష పచ్చిదనంలోంచే
సూర్యుడు నిద్ర లేస్తాడు.
నా చూపు తెలుగు నా శ్వాస తెలుగు
నా స్పర్శ తెలుగు
నా బాధ నా దుఃఖం నా నవ్వు
నా కోపం తెలుగు
నేను తెలుగు
నా భాషను నా ఒంట్లోంచి ఒలిచి
నా చీమూ నెత్తుటి మాటల పేలికల నెగిరేస్తావా
మాతభాషల మరణ మదంగం మీద
పద్మాసనం వేస్తావా
అమాత వెలుగులలంకారం
నా దేహాభరణం కాదు
పగిలిన కన్నీళ్ల పలుకుబడుల గాయాల శాలువా
యాసను ఒడిపెట్టి నేయాలని చూడకు
నెత్తుటి రుచి చప్పరిస్తూ
అమతోత్సవాల వేడుకైన భాష గుడ్లుర్ముతోంది
నిర్వాసితభాషా కన్నీళ్ల సేవనదాహం
యవనాఅక్షరాలు
ఆకస్మిక వద్దాప్యమైయ్యే దుర్భాష
ఖడ్గ ఖచిత రుధిర క్షతాలభాష
మాయాపహరణ క్రీడా
జిహ్వ రుచుల అస్తిత్వ పాతరేసి
వలసపక్షి బీడుభూమి రసోద్దీపమెందుకు?.
ఆత్మ తొలిగిన బొంగురు పదాల పాటెందుకు?
దేశం లూటిబోయిందా?
ఇంకిప్పుడు దోచుకోడానికి
నా భాషా? నా యాసా?
మనసు తాకట్టు పడే దురాక్రమణ భాష !
నా భాషేట్లైతది? నీ కుటిలత్వం!
నా భాష మా అమ్మ పిలుపుపరిమళం
- వడ్డెబోయిన శ్రీనివాస్
9885756071