Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొక్కిలి అయిన వాకిళ్లల్లా
కోటి వెలుగుల వెన్నెల అయితది
కూటికి లేని బతుకులల్ల
ఆత్మగౌరవ నినాదం అయితది
పల్లె పల్లెల్లో పండు అయితది
దండిగా పువ్వుల జాతర అయితది
ఎండిన డొక్కాల యతలను
అలసిన బతుకుల కథలను
రాగం మెత్తి నినాదమై వినిపిస్తది
పువ్వుల పూజించే సంస్కతిని నేర్పుతది
పల్లెల పసుపు వర్ణం చేస్తది
తల్లి లెక్క చెల్లి లెక్కల ఆత్మీయ బంధం
తల్లి పేగు బంధం మది
తంగేడు పువ్వుల మహత్యం
- దేవులపల్లి రమేశ్, 9963701294