Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు శేషేంద్రశర్మ
జయంతి వేడుకలు
19న...
బుధవారం సాయంత్రం 6 గంటలకు సహృదయ సాహితి విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ వెలమల సిమ్మన్న 'శేషేంద్ర కవిత్వం', డాక్టర్ డి వి సుబ్బారావు ప్రసంగాలు ఉండనున్నాయి.
20న...
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో గుంటూరు శేషేంద్రశర్మ జయంతి, పుస్తకావిష్కరణ కార్యక్రమాలను గురువారం మధ్యాహ్నం 3 గం||లకు విశ్వవిద్యాలయం మొదటి అంతస్తులోని కమిటీ హాల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ తంగెడ కిషన్‌రావు, ప్రధాన వక్త ఆచార్య అనుమాండ్ల భూమయ్య, గౌరవ అతిథిగా బానాల మన్మథరెడ్డి రానున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
21న...
హైదరాబాద్‌లోని త్యాగరాయగాన సభ ఆధ్వర్యంలో ఉదయం 10:30ని||లకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. గాన సభ అధ్యక్షులు కళా వి.ఎస్. జనార్దన్‌మూర్తి అధ్యక్షత వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మాజీ శాసన సభాపతి సిరికొండ మధుసూదనా చారి, విశిష్ట అతిథిగా ప్రముఖ సాహితీవేత్త వడ్డెపల్లి కృష్ణ, ఆత్మీయ అతిథులుగా గుంటూరు సాత్యకి తదితరులు రానున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.