Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వయసెంత గడుసైంది
పిలవకుండానే వెన్నంటొస్తుంది
నీడైనా వెలుతుర్లో దాక్కుంటుంది గానీ
వదల్నే వదల్దు.
బాల్యాన్ని బలవంతంగా లాగేసుకుని
నడకకు నెమ్మదత్వాన్నిస్తుంది.
గాయమైతేనే రక్తం కారడం చూసాక
ఇకమీద ఏళ్ళకేళ్ళు ఈ రక్తాన్నే
నెలవారీ నేస్తంగా భరించాలని తెలిసింది.
ఈ కొత్త మార్పు
ఎగిరే పక్షిని పంజరంలో బంధించినట్లయింది.
రక్తం ఎలా వచ్చినా నొప్పి తప్పదు.
అకస్మాత్తు వచ్చేది కాదు
దాని రాకను రోజుల్లో లెక్కపెట్టుకోవాలి
మూడు రోజుల యుద్ధం ముగిసిన తర్వాత
ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం
ఒళ్ళంతా చుట్టుకుంటుంది.
ఎంత బాధపెట్టినా నీవెపుడూ
గొప్ప నేస్తానివి.
రెండు నెలలు ముఖం చాటేస్తే
యిల్లంతా ఎంతానందమో...
ఇంత భరించినా ఆ రోజులు
మైలపడే వుండాలి.
ఏనాడైతే రక్తప్రవాహం ఆగిందో
ముసలితనం అక్కున చేరుతుంది.
ఈ మైలరక్తం లేకపోతే
స్త్రీలింగం శుద్ధికానట్లే ..!
- ర్యాలి ప్రసాద్, 9494553425