Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కవి కూడ చరిత్రకారుడే
కవిత్వం నడుస్తున్న ఇతిహాసం
తరతరాల జనజీవన చిత్రిక''
12 సంపుటాల దేవేందర్ కవిత్వ ప్రస్థానాన్ని రెండు మాటల్లో సూత్రీకరించాలంటె, ఆయన చెప్పిన ఈ పాదాలే సరిగ్గా సరిపోతయి.
మూడు దశాబ్దాల చరిత్ర. మూడు దశాబ్దాల తెలంగాణ చరిత్ర. మూడు దశాబ్దాల సమాజ చరిత్ర. అనేకానేక పొరల చరిత్ర. బహుజనుల చరిత్ర. చరిత్ర బహిష్కతుల చరిత్ర. అట్టడుగున పడి కాన్పించని చరిత్ర. చరిత్ర పుటలకెక్కని చరిత్ర. మార్జినలైజ్డ్ చరిత్ర. ఆ చరిత్రను పైకి లేపి, ప్రధాన చరిత్ర రోడ్డుకడ్డంగా నిలిపిండు దేవేందర్.
ఈ చరిత్ర శుష్కచరిత్ర కాదు. రసహీనమైన చరిత్ర కాదు. కేవలం చరిత్రకారుడి చరిత్ర కాదు. కవి హదయ జనిత చరిత్ర. ఫీలింగ్ సహిత చరిత్ర. కవి మట్టి రేణువులనలుముకున్న చరిత్ర. కవి గుండె శకలాల నదుముకున్న చరిత్ర. రసావిష్కరణ చరిత్ర. సత్యావిష్కరణ చరిత్ర. తెలంగాణ తత్వావిష్కరణ చరిత్ర కూడ.
దేవేందర్ ఈ ముప్పయేళ్ళలో జరిగిన ఏ సంఘటననూ వదిలిపెట్ట లేదు. అన్ని పరిణామాలను అవగతం చేసుకున్నడు. హదయగతం చేసుకున్నడు. అందుకే ఇది అనుభూతిని, అనుభవాన్ని అద్దుకొని వెలువడిన చరిత్ర కవిత్వంగా వెలువడిన చరిత్ర.
దేవేందర్ కవిత్వం మొదటి అడుగు వేసినప్పుడు విప్లవ దక్పథం సాగుతున్నది. ఆ కాలంలో కలంపట్టిన ప్రతి కవీ ఆ వాతావరణాన్నే కవిత్వీకరించిండు. ఈ కవి అక్షరమూ అదే చేసింది.
''నడిచి వచ్చిన బాట
నెత్తుటి ప్రవాహం
నా పానాది నిండా
కత్తుల కరచాలనాలు
నా జెండా ఆకలి పేగుల అలజడి''
ఈ పాదాల్లో ఆనాటి పరిణామం వాడిగా వేడిగా వ్యక్తం కావడం చూస్తాం.
''మాన్ శాంటో విత్తనాలతో
తెలంగాణ పత్తిరైతులను మింగావు
బషీర్ బాగ్ తుపాకుల్లో దాగున్న
కన్పించని శత్రువు నీవు''
అనే పాదాల్లో ప్రపంచీకరణ పర్యవసానం విప్లవ దక్పథంతో కవితాత్మకంగా వ్యక్తమయింది.
''వర్ణాధిక్యం నుంచి భూస్వామ్యం దాక
పెట్టుబడుల నుంచి వర్గస్వామ్యం దాక
పోరాటం చేస్తున్నారు తల్లీ''
ఈ పాదాల్లో దళిత బహుజన చైతన్యం విప్లవ దక్పథమైన వర్గ చైతన్యం మిళితమై కన్పిస్తుంది.
''జర సైసు బిడ్డా
వీల్లేమో లావు నీల్గుతున్నరు...
నాగలి అమ్రిచ్చిండ్రా కర్రుమొన వెట్టిండ్రా''
భారతదేశంలో తొలి సంస్కర్త, బహుజన తత్త్వవేత్త జ్యోతిరావు పూలేను ఇలా ఆవాహన చేసుకున్నాడు.
''మూల వాసుల మూల సుక్క
బహుజన జీవితాల తూర్పురేక
బానిస భావాల ముక్తి ప్రదాత
అధర్మ మనుస్మతి విలాప శాపం
విష కుటిలాన్ని ఛేదించిన పదును
జంధ్యాలు తెగ తెంపిన చరిత''
ఈ ఆవాహన నుంచే కవి బహుజన చైతన్యం పురివిప్పింది.
బహుజన కులవత్తులు చాలామటుకు కళలు కూడా. అదే విషయాన్నిక్కడ అందంగా చెప్తున్నాడు.
''వాకిలంత కమ్మని నీసు
అది బేస్తోల్ల ఇల్లు, జల పుష్పాల జల్లు
వాకిట్ల నిలబెట్టిన మోకు ముస్తాదు....
కమ్ముకున్న కల్లు పొంగు పసందు
అది గౌండ్లోల్ల ఇల్లు, ద్రవ చైతన్య పరవల్లు
కుమ్మరి వాళ్ళమీదనయితే ''బువ్వకుండ'' అనే దీర్ఘకవితే రాసిండు. ఈ కులవత్తి మీద ఎంతో పరిశోధన చేసివుండాలె కవి. చేసి హదయంలో నింపుకొని వుండాలె. లేకపోతే ప్రతీ సూక్ష్మాంశాన్నీ కవిత్వీకరించడం సాధ్యం కాదు.
''కుండ రూపుదాల్చడం అంటే
మన్నులో ప్రాణవాయువు నింపడం...
కుమ్మరి మన్ను ఒక చరిత్ర పరిమళం
కుమ్మరి కుండ ఒక మహత్తర భాండం
తెల్లందాక వాము అగ్గి గుండమైద్ది
తెల్లారే వరకు వాము నిండా కుండలు
ఎర్రని పువ్వులై ధగధగ మెరుస్తయి''
కుంటనుంచో చెరువునుంచో మట్టితేవడంతో మొదలుబెట్టి వాములో కుండలు కాల్చేవరకు గల మొత్తం వత్తి సాంకేతిక కళానైపుణ్యాన్ని, పడే శ్రమను మన కళ్ళముందుంచుతడు. ఆహా ఏమి జీవితాన్ని పట్టుకొచ్చిండు అనిపిస్తడు.
''సమాన గౌరవం ఇయ్యని మగాహంకారాన్ని
కండ కండలుగా నరికి కారం పెట్టా''లంటాడు.
వితంతువుకు జరిగే అవమానం అందరి దష్టిలో పడే తంతయినా ఎవరి కవిత్వంలో పడలేదు, దేవేందర్ కవిత్వంలో పడింది.
''వితంతు తంతు విద్రోహమే
ఆది నుంచి నుదుటనున్న సింధూరం
మునుపటిలా తళతళ మెరుస్తుండాలె
పెత్తనపు పెనిమిటి లేకపోవచ్చు
అయినా ఆమె శుభ మంగళమే''
దటీజ్ దేవేందర్.
పురుషాధిపత్యాన్ని, మగత్వాన్ని స్త్రీ ప్రశ్నించడం, ధిక్కరించడం- పురుషుడు తను స్త్రీకి చేసిన అన్యాయం యెడల షశీఅటవరర కావడం చాలామంది కవితల్లో ఉంది. దేవేందర్ దక్కోణం నూతనం. పురుషుడి మగత్వాన్ని పురుషుడే తులనాడడం, ఆ మగత్వం గురించి స్త్రీని జాగరూకం చేయడం ఆ నూతనత్వం.
కనబడే ప్రతీ మగవాడూ
ఖడ్గమగం కూడా అయి ఉండవచ్చు...
మనుషుల్ని కూడా ఎంచి ఎంచి చూడాలి
మగవాన్నైతే మరీ పరీక్ష పట్టాలె సుమా
కరచాలన స్పర్శ కరవాలమై మెరవచ్చు
తేనె మాటల్లోనే తేల్లు కూడ ఉండవచ్చు
బస్టాండ్లలో రైల్వేస్టేషన్లలో కాలేజీల్లో ఆఫీసుల్లో గోడల మీద రాయదగిన గొప్ప నబశ్ీabశ్రీవ పాదాలివి. ఈ పాదాల్లో ఒక తండ్రి, ఒక సోదరుడు కనబడతాడు. ఒక శ్రేయోభిలాషి స్వరం వినబడుతుంది.
స్త్రీ, దళిత, బహుజన, ముస్లిం అస్తిత్వవాద ప్రవాహాలు సాగుతుండగానే తెలంగాణ అస్తిత్వవాదం ఊటలా మొదలై చూస్తుండగానే ఉవ్వెత్తున ఎగిసి మిగతా ప్రవాహాలను తనలో మిళితం చేసుకున్నది. అప్పటికి తెలంగాణలో ఉన్న అన్ని చైతన్యాలు తమ రూపురేఖల్ని కోల్పోయాయా అన్నంతగా తెలంగాణ అస్తిత్వంలో మమేకమయినయి. సప్తవర్ణాలలో ఒక వర్ణమే ప్రస్ఫుటం కాసాగింది. ఇక్కడి నేలలో, గాలిలో, మట్టిరేణువుల్లో పోరాట స్వభావం ఉందంటాడు. అంతేకాదు ధిక్కార వారసత్వ పుటల్లోకి వెళ్తాడు.
''కొమురం భీముడు దాచిపెట్టిన
విల్లమ్ముల అడవి పొదలు...
దొడ్డికొమురయ్య వీరమరణం...
తిరగబడ్డ పులిబిడ్డలు సమ్మక్క సారక్కలు...
నైజాం రజాకార్ల రాజ్యాన్నే
మన్ను తినిపించిన నేల ఇది''
వీరుల్ని పట్టుకొచ్చి ఆత్మవిశ్వాసం నింపుతాడు. ఈ వీరులే ఉద్యమ ప్రతీకలయినారు. ఆధునిక నాగరికత తలెత్తిన రోజుల్లో ఆ నాగరికతలో ఇమడలేక రొమాంటిక్ కవులు ప్రకతిగానం చేశారు. దీaషస ్‌శీ ్‌ష్ట్రవ చీa్‌బతీవ అని పలవరించారు. గ్రామీణ మానవుడిని తలకెత్తుకున్నారు. ఇప్పుడు ఆధునిక నాగరికతతో పాటు ప్రపంచీకరణ మానవ సంబంధాలను వాటికి నిలయమైన
గ్రామాలను, బాల్యాన్ని, ప్రకతిని, ప్రకతిలో భాగమైన నదులను, గుట్టలను, చెరువులను వెరసి పర్యావరణ సమతుల్యతను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో రొమాంటిక్ కవుల కంటె భిన్నంగా నేటి కవులు ధ్వంసమవుతున్న వాటి గురించి కలత చెంది కవిత్వమవుతున్నారు.
అట్లా దేవేందర్ నాస్టాల్జిక్గానూ వేదనతోనూ అనేక కవితలు రాసిండు. అట్లా...
''ప్రకతి నన్ను కవిగ మార్చింది
విధ్వంసం నన్ను గాయకున్ని చేసింది
గుట్టల రంపపుకోత నా గుండెను తాకింది
పర్యావరణ నాశనం హింస పెట్టింది
జీవ వైవిధ్య హననం కవనం నేర్పింది'' అన్నడు.
కోటబిలిటీ ఉత్తమ కవిత్వ లక్షణాల్లో ఒకటి. సామెతకు, జాతీయానికి ఉండే శక్తి ఈ కోటబుల్ వాక్యాలకుంటది. ఈ లక్షణం దేవేందర్‌లో పుష్కలంగా ఉంది. మచ్చుకు ఒకటి రెండు చూద్దాం.
''అవును పావురాలే నేలరాలతాయి
గద్దలెప్పుడూ ఆకాశంలోనే విహరిస్తాయి''
''దొర గడీని చూస్తే
ఉచ్చ పడేది
ఇప్పుడు అండ్లనే
పోస్తన్నం.''
''వాళ్ళు దొబ్బి తిన్నరు
మనం దోఖ తిన్నం''
ఇవేకాక ఇంతకు ముందు ప్రస్తావించిన వాటిల్లో ఇలాంటివి కోకొల్లలు.
వస్తువు పాతదైనప్పుడు అభివ్యక్తి నవ్యతే కవిని నిలబెడుతుంది. కవిత్వం మీద కవిత్వం ఎంతో మంది రాశారు. ఇది పాత వస్తువే.
''కొలిమిల సరిపిచ్చిన కొడవలి మెరుపు
జకమొకలోంచి రాలిన మిరుగు''
తన కవిత్వం అని బహునూతనంగా అభివ్యక్తం చేసిండు. ఇలాంటివి ఎన్నో ఉన్నవి ఈ సంకలనాలలో...
జీబఞ్aజూశీరవ చేయడం దేవేందర్ మరొక కవిత్వ నిర్మాణ పద్ధతి. కొన్ని ఉదాహరణలు.
''దేహం స్వేదంతో
తడిసి పోకున్నా
రాతల నిండా
శ్రమజీవుల పదాలు''
''జెండా ఎత్తి జైకొట్టింది లేదు
ఉద్యమాల ముచ్చట్లు''
''అక్కడ మూడో పంటకు నీళ్ళిస్తా
ఇక్కడ మూడు కాలాలకు
కన్నీళ్ళు పారిస్తా''
కవిత్వీకరించడంలో దేవేందర్ నిర్మాణ పద్ధతుల ద్వారా సక్సెస్ అయ్యిండు.
వస్తువు రీత్యా, కవితా నిర్మాణ పద్ధతుల రీత్యా కవిత్వ నిర్వహణ నైపుణ్యం రీత్యా ఈ సంకలనంలో ఎన్నో ఉత్తమ కవితలున్నవి. నాకు నచ్చిన కొన్నింటిని పేర్కొంట. కన్నీళ్ళు, పెయ్యికాక, సరిహద్దులు, ఎట్లున్న పట్నం, ఎద్దుగోస, కరువు దరువు, గుండెపాట, ఆనవాలు, మంకమ్మతోట లేబర్ అడ్డా, అతుకని పోగు, ఆమె, నేలపాట, ఎడ్లంగడి, జంత్రి, స్త్రీవాదం, అనేక, అల్కగ, ముఖం, గమ్మతి, అంతర్నేత్రులు, రిలీజ్ ది పోయెట్, నీలోకి నీవే
''రాసిందంతా
తూర్పాలబట్టు
గాలికి పోయేది వచనం
నిలిచిందే కవిత్వం''
కవిత్వానికి దేవేందర్ మంచి నిర్వచనమిచ్చిండు. దేవేందర్ మూడు దశాబ్దాలుగా నిరంతరం కవిత్వం రాస్తూ ఉండడం, 12 సంపుటాలు వేయడం, వీటిని కలిపి బహత్ సంకలనం వేయడం కవిత్వం పట్ల గల ఆయన ప్రేమకు సమాజం పట్ల గల నిబద్ధతకు నిదర్శనం.
(అక్టోబర్ 17, 2022 అన్నవరం దేవేందర్‌కు 60 యేండ్లు నిండిన సందర్భం)
- డా|| సుంకిరెడ్డి నారాయణరెడ్డి, 9885682572