Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు ప్రతి శ్రమట చుక్క
ధాన్యం గింజల బస్తాలై అంగట్లో ఆగమే !
మద్దతు ధర కాడ కాంటా కింద మీద ఊగుడే
స్థిరం లేదు !
కిసానుకు పట్ట పగలే లెక్క పెట్టలేనన్ని
చుక్కలు కనపడకుండా ఉంటాయా !
గని కార్మీకుని శ్రమట చుక్కలు
బొగ్గులు బొగ్గులుగా
గూడ్సు డబ్బాల్లో తరలి పోతాయి
శ్రామికుని చేతిలో ప్రసాదంగా
చిల్లి గవ్వలు మాత్రమే
మిగిలింది ఎప్పుడూ పోరాటమే!
రోజు వారి కూలి అంత్రాల బంగ్లాలకు
రాళ్లు మోయంగ మోయంగ
ఒంటి మీద ఊటైన శ్రమట సుక్కలు
చెమటతో కలిసి ఇంకా గట్టి పడిపోతాయి !
సాయంత్రానికి ఆకలి సెమట చల్లారడానికి
అర కొర నోట్లే
ఇంకా అడిగితే కొరకొర చూపులే !
వంటింట్లో అమ్మ నుదుటి శ్రమట సుక్కలు
తియ్యటి భక్ష్యాలై అందరి నోటిని
తీపిగా పండగ చేస్తాయి
చివరకు అమ్మ తినబోతే ఖాళీ ఖాళీ గిన్నెలే
అడుగడుగు ప్రసాదం !
ఇప్పటికీ శ్రమట సుక్కలను సరితూచే రాళ్లు లేనే లేవు
దోపిడిగా ఒడవని వ్యూహాలే
శ్రమట చుక్క ఎప్పుడూ బంగారం కాలే !
బొగ్గు బొగ్గే ! !
- కందాళై రాఘవాచార్య, 8790593638