Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిథిలమైన రాతిశిల్పాలు
సూర్యసింహాలుగా చెక్కబడినప్పుడు
ఎక్కడో కోసుకుపోయిన నదిపైన
క్రూరమైన జంతువు విస్తరిస్తుంది
ఒక ఉదయం తర్వాత
నది వదిలిన విసర్జనలో
మనుషులు మునుగుతారు
మళ్లీ బతికి రావడానికి
శ్వాసతో తన్నులాట జరుగుతుంది
గెలిచేది ఊపిరో! నదో!
చూపులేని నిద్రకు పుట్టిన శిశువు
తన తండ్రిని ఎక్కడ కలగనాలి
రాతి కలల్లో నిలిచిన
ప్రేమతాపాన్ని అనుభవించిన తర్వాత
వాస్తవానికీ, కల్పనకీ
రహస్య వంశక్రమాన్ని జోడించడం
అస్తిత్వపు శరీరాలు దెబ్బతిన్న కండరాళ్లు
శతాబ్దాల కిందట కూరుకుపోయిన ప్రపంచానికి
నా కవిత్వం అస్తమించని,
మహోద్రేకమైన ఔషధం
మనుషులు చెట్ల వలె, మేఘాల వలె
చీలిపోతున్నారు
విశ్వాసాలు, మూఢనమ్మకాల గదిలో
చితిపై చేరిన మరణంలా స్వర్గ-నరకాలంటూ
ఘనీభవించిన ముఖాలతో
నిద్రాచైతన్యాల నడుమ మూలాన్ని మరుస్తున్నారు
శరీరం మీద
కలల సంవత్సరాలు తేలిపోతున్నాయి
చివికిన కాగితంలా
జీవితాలు చింపివేయబడుతున్నాయి
- జాని తక్కెడశిల, 7259511956