Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపావళి తెల్లారి
దిన పత్రిక రాలేదు
ఉదయం వూరికే కదలదు కదా
వాకిట్లో ని అక్షరాలను చదువుతున్నా
తమిళ తంబీలు నవ్వుతున్నారు నన్ను చూసి
వాకిలి నిండా
పిల్లల కేరింతలు పరుచుకున్నాయి
గాలి వచ్చి దాడి చేయక ముందే
నలుగు ఫోటోలు తీసి
నిన్నటి వెలుగుల్ని బందించాలి
అమ్మ లేచి వూడవక ముందే
కాలని బాంబులు కొన్ని
కుప్పలు పోసి వెలిగించి
పిల్ల దీపావళి జరుపుకునేటోళ్ళం
బాల్యం అంటే భేషిజం లేని జ్ఞాపకాలే
కాశీ చేతులు మసి బారితే
దేశమంతా చిచ్చుబుడ్లు నింగిలో
అక్కడి బాల్యం కరిగి కాలి
ఇక్కడ వాకిలి విర బూసింది
మనం పటాసులు కాల్వకుంటే
కార్మికుల కడుపులు నిండేదెలా
ఆకాశం కొంత కోపగించినా
డబ్బులు వృధా కాలేదు...
- దాసరి మోహన్, 9985309080