Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ఈ నెల 20, 21, 22 తేదీలలో లిటరరీ ఫెస్ట్ -2022ను నిర్వహిస్తున్నది. ఈ సారి పాట కేంద్రంగా జాన పద, ప్రజాపాటలు, లలితగీతాలు పాడే వారిని, పాటలు రాసే కవులను ఆహ్వానిస్తున్నారు. పాటలు, పరిచయాలు, అభినందన ఈ ఫెస్ట్‌లో కొనసాగుతాయి. సముద్రాల నుండి నేటితరం సినీగీత రచయితల పాటలలోని సాహిత్యంపై సదస్సు, చర్చలూ నిర్వహిస్తున్నారు.
మూడు రోజుల ఈ ఫెస్ట్‌లో సినీరంగ ప్రముఖులు పరుచూరి గోపాల కష్ణ, గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు కె.ఐ. వరప్రసాదరెడ్డి, నరేంద్ర పరుచూరి, సాంస్కతికశాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, మాదాల రవి, సుద్దాల అశోక్ తేజ, ఎల్బీ శ్రీరాం, భువన చంద్ర, జెకె.భారవి, నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, చైతన్య ప్రసాద్, యశ్ పాల్, పి.ఏ దేవి, సీతారాం, వంశీకృష్ణ, విమలక్క, అయినంపూడి శ్రీలక్ష్మి తదితరులతో పాటు వాగ్గేయకారులు, ప్రజాగాయకులు పాల్గొంటారు. మూడవ రోజు సాయంత్రం కవి సమ్మేళనం వుండనున్నాయి. గాయకులు, రచయితలు, కవులు పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి కోరారు. వివరాలకు 9390099083, 8897765417, 9393804472 నంబరు నందు సంప్రదించవచ్చు.